Friday 27 July 2018

మన శ్శాంతిని ,మనో జయాన్ని కోరువారు జపించవలసిన నర నారాయణ మంత్రం

మన శ్శాంతిని ,మనో జయాన్ని కోరువారు జపించవలసిన నర నారాయణ మంత్రం.

ఓం నమో భగవతే ఉపశమశీలాయ
ఉపరత అనాత్మ్యాయా నమో అకించిన విత్తాయ
రుషి రుషభాయ నరనారాయణాయ
పరమహంస పరమ గురవే
ఆత్మ రామాధిపతయే నమో నమ ఇతి

ఈ మంత్రం జపించుట వలన మనశ్శాంతి, మనో నిగ్రహం,మనో జయం కలగడమే కాక, భక్తి శ్రద్ధలతో జపించటం వలన కోపాన్ని ,కోరికలను గెలవవచ్చు.అంతే కాక విద్యా బుద్ధులు ,సత్ప్రవర్తన అలవడుతాయి.లోక కళ్యాణ కాంక్ష కలిగిన వారు ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపించాలి.
మంత్రమూలం - శ్రీమద్భాగవతం లోని పంచమ స్కంధం

మంత్ర జప విధానం - ప్రాత:కాలమునే లేచి స్నానాదులు ముగించుకుని పరిషుద్ధమైన వస్త్రాలు ధరించి లలాటమున తిలకం దిద్దుకుని పూజా మందిరంలో దీపారాధన చేసి తమ నిత్య కృత్యములైన సంధ్యా వందనాది కార్యక్రమాలను ముగించుకుని నిశ్చలమైన పరిశుద్ధమైన మనస్సుతో తమ తమ శక్తి కి అనుగుణంగా మంత్రాన్ని జపించాలి.

Wednesday 25 July 2018

దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా - భజన

దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా
దర్శనమీయరా దయాసాగరా దానవ హరణా దామోదరా

పరి పరి విధముల ప్రస్తుతి జేసితీ
పార జూడవా పరాత్పరా               " దర్శ "

వేదస్వరూపా అని వేయిమార్లు పిలిచినా
పలుకవు పిలిచిన,ఫలమేమి లేదురా     " దర్శ "

ముమ్మాటికి నీ వాడను నేననీ
మురళీ దాసుడ కరుణించవా         " దర్శ "

మనోహరం మహా వరం సాయి ఉపన్యాసం - భజన

మనోహరం మహా వరం సాయి ఉపన్యాసం
మరపు రాదు మరల రాదు మనకీ అవకాశం  " మనో "

వేదికపై సాయి ఉపన్యాసించుచుండగా
వినిన చెవులు పండగా వినని చెవులు దండగా    " మనో "

మందహాస వదనముతో సాయి పలుకరించగా
సనాతనా సారథీ స్వర్గానికి వారధీ      " మనో "


Monday 23 July 2018

కృష్ణమ్మ పరవళ్ళు - కవిత

తుళ్ళి తుళ్ళి పడుతూ
పరవళ్ళు తొక్కుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

ఒక్కో అడ్డంకి దాటుతూ
తడారిన ప్రాజెక్టులు నింపుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

జనుల కళ్ళలో సంతసం నింపుతూ
జన దాహం ,భూదాహం తీర్చుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

పిల్లా పాపల భవిష్యత్ కు భరోసానిస్తూ
తెలుగు ప్రజల కడగండ్లు తీర్చడానికి
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

స్వాగతం సుస్వాగతం కృష్ణవేణీ
తెలుగింటి విరిబోణీ మా ఇంటి అలివేణీ
నీ పాదాలకు మా వినమ్ర నమస్సుమాంజలులు

పచ్చదనం పరవళ్ళు-గ్రీన్ చాలెంజ్-కవిత

పచ్చదనం పరవళ్ళు తొక్కుతోంది కొంగ్రొత్త ఆలోచనలతో
ఇగ్నిటెడ్ మైండ్స్,వాక్ ఫర్ వాటర్ వంటి స్వచ్చంద సంస్థల విజ్రుంభణతో
గ్రీన్ చాలెంజ్ పరుగెత్తుతోంది నూతనోత్తేజం తో
ప్రతి మనిషీ కావాలి ఒక స్వచ్చంద సేవకుడు ఈ విజయ స్ఫూర్తితో
ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అంకురార్పణ కావాలి ఈ ప్రేరణతో
ప్రపంచం ఉలిక్కి పడాలి తెలుగు ప్రజల ఖ్యాతితో
అభివృద్ధి జరుగుతుంది శరవేగంగా ఇలాంటి వినూత్న ఆలోచనలతో
ఇరుగు పొరుగు రాష్ట్రాలనూ కలుపుకోవాలి ఈ కార్యక్రమంలో స్నేహభావంతో
అందరి అభివృద్ధీ మా కోరికని చాటాలి విశాల భావంతో
అపుడు నెలకొంటుంది శాంతి సుస్థిరంగా సంభ్రమాశ్చర్యాలతో
విచ్చేయుదురు లక్ష్మీ సరస్వతులు కరుణా కటాక్షములతో
పలకాలి సుస్వాగతం వారికి మంగళ వాయిద్యాలతో

Saturday 21 July 2018

కాలుష్య భూతం - కవిత

తర తరాలుగా ఎంతో బాధిస్తున్నదీ కాలుష్య భూతం
తన,పర భేదం లేకుండా అందరిపై చూపుతోందీ తన ప్రతాపం
స్వార్థం,నిర్లక్ష్యం చూపడం మహా పాపం
ఇంత అజ్ఞానం ఉండడం నిజంగా మనకొక శాపం
కఠిన చర్యలే దీనికి చక్కటి శరా ఘాతం
తద్వారా తక్షణమే ఉపశమించును మహా తాపం
జనులెల్లరు తప్పించుకొనెదరు మహా క్షామం
భవిష్యత్ తరాలు పొందును చక్కటి ప్రాప్తం
ఎగురవేయును ఆరోగ్య జయ కేతనం
దీనికి మనమే కావాలి మూల కారణం
ఇది కలిగించును మనకెంతో గర్వ కారణం.

నందలాల నవనీత చోరా నట్వర్ లాలా గోపాలా

నందలాల నవనీత చోరా నట్వర్ లాలా గోపాలా
దేవకీ వసుదేవ కుమార దేవ దేవా గోపాలా    !! నం !!

మొహన మురళి గాన విలోలా మోహనా జయ గోపాలా
షిరిడి పురీషా సుందర రూపా సాయి దేవా గోపాలా    !! నం !!