Tuesday 9 October 2018

జగత్పతే హరి శ్యామ గోపాలా - భజన

జగత్పతే హరి శ్యామ గోపాలా
జగదొద్ధారా జయ నంద లాలా
మధురాధిపతే కృష్ణగోపాలా
మధుర మధురహే గాన విలోలా
జగదోద్ధారా జయనంద లాలా
జయనంద లాలా జై జై గోపాలా 2    " జగత్పతే "

నేనొక కవిని - కవిత

నేనొక కవిని
నిరంతరం జ్వలించే రవిని
సృజనాత్మకతకై తపించే జీవిని
రుచికర లేత చిగురుమావిని
సదా ఆలోచనల ఊట ఊరే ఊటబావిని
రణగొణ ధ్వనుల ప్రపంచంలో వినూత్న శబ్దాలకై రిక్కించి వినే చెవిని
కవిత్వమనే మహా సముద్రంలో చిన్న నీటి బిందువుని
కవిత్వమనే విశాల ఎడారిలో చిరు ఇసుక రేణువుని
విశాల వృక్ష సామ్రాజ్యంలో ఔషధ వృక్షం రావిని
కవిత్వ ప్రపంచంలో బుడి బుడి నడకలు వేస్తున్న బుజ్జాయిని
సకల దేవతలు వసించే దివిని
సకల ప్రాణికోటి వసించే భువిని
నేనొక కవిని


కావ రాగదయ్యా కాశీ విశ్వనాథా - భజన

కావ రాగదయ్యా కాశీ విశ్వనాథా
కాన రాగదయ్యా కన్నీటి ధారా   " కావ "

నీలకంఠ రావా దిక్కు నీవె కావా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా   " కావ "

విఠల నేత్ర నాపై కఠినమేలనయ్యా 3
నీలకంఠ నాపై జాలే లేదా   " కావ "

పన్నగేంద్ర భూషా పలుకవేలనయ్యా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా  " కావ "

ప్రేమ మీద నీదు నామ భజన చేసే 3
రామచంద్ర బ్రోవ రావా ఓ దేవా   " కావ "

Wednesday 3 October 2018

మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా - భజన

మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా
ప్రాణం పోసావా అయ్యప్పా మనిషిని చేసావా  " మట్టి "

తల్లి గర్భమున నన్నూ తొమ్మిది నెలలూ ఉంచావూ
పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగ తుంచేస్తున్నావు   " మట్టి "

కులములోన పుట్టించావూ కూటికి పేదను చేసావూ
కర్మ బంధాల ముడిలో వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు   " మట్టి "

కోటీశ్వరుని చేసావూ కోటలెన్నొ కట్టించావూ
సిరిసంపదలను శిధిలం చేసి కాటిలోనె కలిపేస్తున్నావు  " మట్టి "

హరిహరులకు జన్మించావూ శబరి గిరీపై వెలిశావు
శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శబరీ వాసుడవయ్యావు   " మట్టి "

సరస్సునైదు శిరస్సులున్న చేప ఉన్నదీ - భజన

సరస్సునైదు శిరస్సులున్న చేప ఉన్నదీ
సరసమైన మంచి మడుగు దానికున్నదీ
మర్మమెరిగియున్నదీ మాటలాడుచున్నదీ
మనసారా జలమునందు ఈదుచున్నదీ           "  సరస్సునైదు  "


ఏరు కాదు దీనికెన్నొ దారులున్నవీ
దారులున్న తీరు నీరు పారుతున్నదీ
గమ్మతైన ద్వారమ్ములు తొమ్మిదున్నవీ
నమ్మరాదు నమ్మరాదు మోసమున్నదీ             "  సరస్సునైదు  "


అలలు ఆరు జలమునంత ఊపుచున్నవీ
జలమునంత కలుషితంబు చేయుచున్నవీ
కలవరపడి చేప దిగులు చెందుతున్నదీ
కొలను వీడి పోవాలని ఆశ ఉన్నదీ                       "  సరస్సునైదు  "


మోసకారి చిత్రమైన మొసలి యున్నదీ
చేపతోటి తాను చెలిమి చేయుచున్నదీ
దిక్కు లేని దిశకు దీన్ని తింపుతున్నదీ
అదను చూచి మింగాలని ఆశ ఉన్నదీ                     "  సరస్సునైదు  "


చేప కొరకు జాలరి వల వేసి ఉన్నదీ
వలకు చిక్కరాదని గురువాజ్ఞ ఉన్నదీ
కొలనులోని చేపకేమి తోచకున్నదీ
కవి రాముని హృదయము దిగులొందుచున్నదీ         "  సరస్సునైదు  "

ఆంజనేయా వరములీయా వేగ రావయా - భజన

ఆంజనేయా వరములీయా వేగ రావయా
నీవె దేవా మమ్ము బ్రోచే భక్త మందారా  " ఆంజ "

నీదు మధుర నామము నే ప్రేమతో భజియింతును
నిన్ను కొలిచే భక్త కోటి మొరలు వినవయ్యా కావ రావయ్యా   " ఆంజ "

నిన్ను తలచిన చాలునూ మా చెంతనుండి గాతువూ
భయము లేదు దేవ నీ కరుణ ఉండగనూ మాకు
తోడు ఉండగనూ నీ కరుణ ఉండగనూ  " ఆంజ "

నీదు చల్లని నీడలోన నిండు స్వర్గము ఉన్నదయ్యా
రామ దూత నీవె మాకు దిక్కు నీవయ్యా
మమ్మేల రావయ్యా     " ఆంజ "



నారాయణ్ జప్ నా నిరంతర్ - భజన

నారాయణ్ జప్ నా నిరంతర్
ఇస్ జగత్ మే కోయి న అప్ నా  2
దేఖ్ రహే సప్ నా సప్ నా  2    " నారా "

ఆజ్ ప్రభూ కా ఖేల్ ఖిలో నా  2
మాయా కే రచ్ నా రచ్ నా  2   " నారా "

అంత్ సమయ్ కచ్ సాధన్ ఆవత్  2
చొడ్ సభీ చల్ నా చల్ నా  " నారా "

శివరామాత్మజ్ త్యజ్ అభిమాన్ కో  2
ప్రభు భజన్ కర్ నా కర్ నా
హరి భజన్ కర్ నా కర్ నా        " నారా "