Sunday 28 May 2017

నీవు జయిస్తావు. / NEEVU JAYISTHAVU


మనందరిలోనూ అంతుచిక్కని గొప్ప విలువలు గోప్యంగా ఉన్నాయి.మన వల్ల చేతనవుతుంది, మనవల్ల చేతనవదు అన్నది మనకు సంబంధించిందిగానే ఉంటుంది.కాని 'నేను చేస్తాను 'అన్న మనోవైఖరి ఉండాలి.

ఏదైనా కౄరమృగాన్ని అదుపులో పెట్టాలంటే ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది.కాని పోను పోను దానిపైన స్వారీ చేసినా అది ఏమీ చెయ్యనంత సమర్ధతతో దాని శిక్షకుడు దానిని వశం చేసుకుంటాడు.మనం సర్కస్ లో సాధారణంగా ఇలాంటివి చూస్తుంటాము.అదే విధంగా మనం కౄరంగా ఉన్న మనస్సును మన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

జీవితం ఒక శారీరకమైన రాకపోకలతోనే పరిమితమైంది కాదు.అది చాలా విశాలమైనది.

వేదాంతపరంగా చెప్పే కాలనిర్ణయం వేరుగా ఉంటుంది.ఒక బండరాయిపైన ,ఇంటికప్పుపైనుంచి రోజూ ఒక్కొక్క బొట్టుగా నీరు పడుతుంటే కొంత కాలానికి రాయి అరిగిపోవడం చూస్తం.

ఒక భక్తుడు రోజూ సాష్టాంగ ప్రణామం చేసి,తన నుదురును నేలపైన ఆనిస్తుంటే కొన్ని సంవత్సరాలకు సొట్టపడటం చూసాను.దానివల్ల అభ్యాసానికి ఎంత విలువుందో తెలుస్తుంది.

మృదువైన నీటి బిందువు రాయిలో మార్పు తీసుకురాగలిగినప్పుడు ,చంచలంగా ఉన్న మనస్సుకు శిక్షణనిచ్చి నిశ్చలంగా చేసినట్లైతే సత్యంలోనికి అది తప్పకుండా చొచ్చుకుపోగలుగుతుంది.

గొప్ప గురువులు అనబడే వారందరిచేతా ' ఓర్పుగా ఉండి,మెలకువగా ఉండి,కష్టపడు,నీవు జయించుతావు ' అని చెప్పబడింది.

ఓటమికి ఆధ్యాత్మిక జీవితంలో స్థానమే లేదు.ఎన్నిసార్లు ఓటమి కలిగినా చివరికి జయిస్తావు.

                              ---- స్వామి రంగనాథానందజీ .

No comments:

Post a Comment