Thursday 30 August 2018

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...- కవిత

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...
చిన్నవాడైనా అగును పెద్ద మనసున్నవాడుగా...
చిట్టెలుకయే ఆపదలో కాపాడెను మృగరాజును...
చిగురుటాకులే మార్చును చిన్న మొక్కను మహా వృక్షంగా...
చిరు గింజయే పుట్టించును మధుర ఫలాలనిచ్చే వృక్షాన్ని...
చిరు అడుగులే చేర్చును ఎంత పెద్ద గమ్యమైనా...
చిల్లర పోగేస్తే మారుతుంది ఆపదలో ఆదుకునే నేస్తంగా...
చిరుగాలి కలిగించును మనసుకు ఎంతో హాయి...
చిరు ఉడుతయే నిలిచెను సహాయానికి మారు పేరుగా...
చిరు అణువుయే సృష్టించును మహా ప్రళయం...
చిరు వామనుడే ఆక్రమించెను ముల్లోకాలను చిరు అడుగులతో...
చిరు రంధ్రమే ముంచి వేయును పెద్ద ఓడను మహా సముద్రంలో...
చిరు తిండియే పాడు చేయును విలువైన ఆరోగ్యాన్ని...
చిరు వైరసే కబళించివేయును విలువైన ప్రాణాలను...
చిరు అంటేనే జ్ఞప్తికి వచ్చును పవర్ ఫుల్ " మెగా స్టార్ "...
చిరు స్టెప్పులేస్తే తన్మయత్వంతో ఊగిపోవును సినీ అభిమానులు ...
చిరు చీమ యే నిలిచెను శ్రమకు స్ఫూర్తిగా
చిరు అపార్థమే కలిగించును సంబంధబాంధవ్యాల విచ్చిన్నం
చిరు గడ్డి పోచలే ఐక్యమై బంధించును గజరాజును సైతం...
చిరు మెజారిటీ ఐనా నిలుపును విజేతగా ఎంత పెద్ద పందెంలోనైనా...
చిరు ధాన్యాలు కలిగియుండెను ఎన్నో పోషకవిలువలు...
చిరు బాలల హృదయాలే వెలుగొందెను నిష్కల్మష దైవ మందిరాలుగా
చిరు బాల వాక్కుయే వర్ధిల్లెను బ్రహ్మ వాక్కుగా...
చిరు ప్రాయ జ్ఞాపకాలే కలిగించును ఎంతో ఆనందం...
చిరు శిశువులే నిరూపించెను సతీ అనసూయా దేవి మహిమను...
చిరు బాలలతో ఆటలాడెను సద్గురు శ్రీ సాయినాథులు...
చిరు నలుసే కలిగించును కంటికి ఎంతో బాధ...
చిరు ప్రహ్లాదుడే నిరూపించెను హరి నామ మహిమను...
చిరు కృష్ణుడే చూపెను ఎన్నో మాయా లీలలు...
చిరు చక్కిలిగిలే కదిలించివేయును ఎంతటి భారీ శరీరాన్నైనా...
చిరు శబ్దమే కాపాడెను ధర్మరాజు సత్య సంధతను...
చిరు బాలల పలుకులే కలిగించును మనసుకెంతో మురిపెం...
చిరు పల్లెలే అయ్యెను దేశానికి పట్టుగొమ్మలు...
చిరు తప్పిదము దారితీయును పెను ప్రమాదానికి...
చిరు దీపమే తరిమికొట్టును కారు చీకట్లను
చిరు ఏదైనా కలిగించును నష్టమైనా లాభమైనా భారీగా...
" చిరు అంశం " పట్ల ఎప్పుడూ " చిన్న చూపు " వలదు సుమా...

No comments:

Post a Comment