Wednesday 3 October 2018

సరస్సునైదు శిరస్సులున్న చేప ఉన్నదీ - భజన

సరస్సునైదు శిరస్సులున్న చేప ఉన్నదీ
సరసమైన మంచి మడుగు దానికున్నదీ
మర్మమెరిగియున్నదీ మాటలాడుచున్నదీ
మనసారా జలమునందు ఈదుచున్నదీ           "  సరస్సునైదు  "


ఏరు కాదు దీనికెన్నొ దారులున్నవీ
దారులున్న తీరు నీరు పారుతున్నదీ
గమ్మతైన ద్వారమ్ములు తొమ్మిదున్నవీ
నమ్మరాదు నమ్మరాదు మోసమున్నదీ             "  సరస్సునైదు  "


అలలు ఆరు జలమునంత ఊపుచున్నవీ
జలమునంత కలుషితంబు చేయుచున్నవీ
కలవరపడి చేప దిగులు చెందుతున్నదీ
కొలను వీడి పోవాలని ఆశ ఉన్నదీ                       "  సరస్సునైదు  "


మోసకారి చిత్రమైన మొసలి యున్నదీ
చేపతోటి తాను చెలిమి చేయుచున్నదీ
దిక్కు లేని దిశకు దీన్ని తింపుతున్నదీ
అదను చూచి మింగాలని ఆశ ఉన్నదీ                     "  సరస్సునైదు  "


చేప కొరకు జాలరి వల వేసి ఉన్నదీ
వలకు చిక్కరాదని గురువాజ్ఞ ఉన్నదీ
కొలనులోని చేపకేమి తోచకున్నదీ
కవి రాముని హృదయము దిగులొందుచున్నదీ         "  సరస్సునైదు  "

No comments:

Post a Comment