Friday 21 December 2018

నాలుగు మంచి మాటలు


1. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపి అయిన పరమేశ్వరుని దర్శింపుము.

2. నీ భాగ్య రేఖ తొలగిన వేళలో నీకు తోడెవ్వరు రారు.అలాగని బాధ పడవద్దు.నిరంతరం నిన్ను వెంటాడే నీ నీడ నీవే కనుక వెలుగు నుండి చీకటిలోకి వెళ్ళినప్పుడు లేదు కదా.

3. నీకన్నా తక్కువ అదృష్టం గల వారిని చిన్న చూపుతో చూడకు.

4. కళయే దైవ సమానం.

5. యాచకులను నిందించకు.నిజానికి లోకులందరూ యాచకులే.

6. కళను,కళాకారులను దూషించకు.నీవు కళాకారుడవైతే ఇతరులను కళావంతులుగా చేయుటకై యత్నించు.

7. జగమంతయు జగదీశ్వరుని సామ్రాజ్యం.అతడు ఎవరికి ఏ పదవినిచ్చునో ఎవ్వరమెరుగలేము.

8. మత్తు పానీయాలు తాగినవాడు దేహాన్ని మరచిపోతాడు.బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు జగత్తునే మరచిపోతాడు.

9.లోభత్వం వీడక మనిషి జ్ఞానం పొందలేడు.

10. మహాత్ములు పరోపకారార్థమై ,లోక కళ్యాణార్థమై అవతరిస్తారు.

11. చంచల చిత్తం సంగీత శ్రవణం ద్వారా ప్రశాంతం నొందగలదు.

12. శ్రమను గుర్తెరుగని యజమానులను సేవింపకు.

13.అపాత్ర దానం మంచిది కాదు.

14. ధనము లేనిదే ఏ పని జరుగదు.కావున ధనం విలువైనది.ధనము విలువను గుర్తెరిగే జ్ఞానము ఇంకా విలువైనది.

15.నీవు పొందుతున్న సౌఖ్యాలు ప్రస్తుతం తరిగిపోతున్న గతములోని పుణ్యపు మూట ,కష్టాలు తరిగిపోతున్న గతములోని నీ పాపపు మూట.

16. కోరకయే ప్రతివారికి భగవంతుడిచ్చే వరం మరణం.

17. ఎంతటి వారైనా దురభిమానం వీడవచ్చు కాని ఆత్మాభిమానాన్ని పూర్తిగా వీడలేరు.

18. విద్య,బల,జాతి,ధన గర్వముతో ఇతరులను వంచించి బాధించకూడదు.

19. అహంకారం నశించే వరకు మనిషి జ్ఞాని కాలేడు.

20. మనిషి ఏది చేసినా జన్మమున్నంతవరకే,త్వరపడి మంచి పనులు చేయండి.పుణ్యాత్ములై శుభఫలితాలనొందండి.మీరు జ్ఞానులై అజ్ఞానులను జ్ఞానులుగా చేయండి.

21. సామ వేద సారమే సంగీతము.

22. జీవ హింస మహా పాతకం.

23.దేహధారి అయిన ప్రతివారికి ఇంచుమించుగా కష్టసుఖాలుంటాయి.

24. మనిషి డబ్బుతో ఎన్నో కొన్నప్పటికి నిమిషమాయువును కూడా కొనలేడు.

25. నిరాకార స్వరూపి అయిన భగవానుని ఉనికి తెలిసికొనుటకు ఏ మూర్తినైనా పూజించవచ్చు.

26. నైరాశ్యము మరియు దురాశ - ఇవి జీవిత లక్షణాలు కావు.

27. భక్తి పేరున అమాయకులను దోచుకునే వారు పాపాత్ములు.

28. అతిథులను శక్తికొలది ఆదరింపుము.

29.ప్రశ్నిచిన వాని ప్రశ్నను బట్టి అతని వివేకము నిర్ధారించవచ్చు.వివేకమైన ప్రశ్న అల్పుడడగలేడు.

30. కళను ఆదరించేవారికన్నా కళను ఆరాధించే వారు చాలా తక్కువగా ఉంటారు.

31.వృద్ధాప్యము మనిషికి భగవంతుడిచ్చే శిక్షలలో చిట్టచివరిది.

No comments:

Post a Comment