Wednesday 7 June 2017

గోవు విశిష్టత ఏమిటి? / GOVU VISHISHTATHA YEMITI?


మాతా ఆదిత్యానాం దుహితా వసూనాం
ప్రాణ్:ప్రజానాం అమ్రుతస్య నాభి:
హిరణ్య వర్ణా మధుకళా ఘృతాచి
మహానుభర్గశ్చ రతిమర్త్యేషు

అనగా ద్వాదశాదిత్యులకు అనగా 12 మంది సూర్యులకు తల్లి.అష్ట వసువులకు / దేవతలకు బిడ్డ గోవు.ప్రజలకు ప్రాణం . అమృతమునకు పుట్టినిల్లు.బంగారు రంగు కలది , పాలను వర్షిస్తూ , నేతిని నింపుతూ పరిపూర్ణమైన గోవు మన లోకంలో సంచరిస్తున్నది అని అర్థం.దుష్టులను సమ్హరించేది, సజ్జనులను కాపాడేది గోవు.ప్రాణులకు అన్నపానీయాలు అందించేది ,హితమును బోధించే గురువును ప్రసాదించేది , ధర్మ పాలకులను అందించేది, దేవతలందరికీ నిలయమైనది.మహేశ్వరునికి వాహనమైనది గోవు. " గో " అనే శబ్దం " ఓం " అనే పవిత్ర శబ్దానికి సమానం.

No comments:

Post a Comment