Thursday 1 June 2017

ఎదిగిన కొద్దీ ఒదగాలి / శ్రీకృష్ణుడి పాదసేవ / YEDHIGINA KODDEE ODHAGALI SREEKRUSHNUDI PADASEVA

పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయ తలపెట్టాడు.యాగానికి 15 రోజుల ముందు సోదరులను ,కౌరవులను,కృష్ణ భగవానుణ్ణి ,ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు.యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరాడు.సభకు హాజరైన వారంతా ధర్మరాజు ఏం చెబితే అది చేస్తామన్నారు.భీముడికి భోజనాల విభాగం,కర్ణుడికి దాన ధర్మాలు,దుర్యోధనుడికి ఆదాయ వ్యయ విషయాలు ఇలా ఒక్కొకరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు.అప్పుడు శ్రీకృష్ణుదు లేచి అందరికీ పనులు అప్పగిస్తున్నావు మరి నా మాటేమిటి అని అడిగాడు.అపుడు ధర్మరాజు " పరమాత్మా మీరు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ మీ సాన్నిధ్యబలంతో యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని బదులిచ్చాడు.ఐనా శ్రీకృష్ణుదు అందుకు ఒప్పుకోలేదు.తనకేదైన పని అప్పగింఛాల్సిందేనని పట్టుబట్టాడు.దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక తికమక పడ్డాడు ధర్మరాజు.అతడి ఇబ్బందిని గ్రహించిన కృష్ణుడు " ధర్మరాజా యాగనికి వచ్చే మునులు ,రుషుల పాదాలు కడిగే బాధ్యత నాదని చెప్పాడు.అది విని ధర్మరాజు విస్తుపోయాడు.అన్నట్లుగానే తపస్సంపన్నుల పాదసేవ చేశాడు కృష్ణుడు.రాజసూయ యాగం పూర్తైన పిదప అగ్రపూజ అందుకున్నాడు.ఎంతవాడైనా ఒదిగి ఉండాలని లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనతో.

No comments:

Post a Comment