Tuesday 27 February 2024

నేటి నుండి పద్మనాభ స్వామి ఉత్సవాలు

 ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన రాతికుండల నడుమ వెలసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారం గా నిలుస్తున్నాడు మల్కాపూర్ శివారులోని వందల ఏళ్ల నాటి ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఏటా మాఘ బహుళ తదియ నుంచి మాఘ బహుళ అష్టమి వరకు వేడుకలు నిర్వహిస్తారు మొదటిరోజు అంకురార్పణతో కార్యక్రమాలు మొదలై ఆరు రోజులపాటు కొనసాగుతాయి ధ్వజారోహణ కళ్యాణము డోలారోహణము రథోత్సవము చక్రతీర్థము ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు చేపడతారు. మల్కాపూర్ ఏ లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు వస్తారు

37 ఆలయ చరిత్ర శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపంలో వెలసిన పద్మనాభ స్వామి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు ఈ ప్రాంతాన్ని పాలించిన గాంధారి వంశస్థులు రాజ్యాన్ని విస్తరించే క్రమంలో మల్కాపూర్ ఏ శివారులో గుర్రపు బండ్లపై సంచరించారు గుండారము మల్కాపూర్ మధ్యనున్న పెద్ద చెరువు వద్దకు రాగానే గుర్రాలు ఆగిపోయాయి. ఓ అశ్వం తాళ్లు తెంచుకొని పరుగులు తీసింది దానిని సైనికులు రాజకుటింబీకులు వెంబడించారు చెరువుగట్టుపై ఎత్తైన కొండపై ఉన్న రాతి గుహల్లోకి వెళ్లిన గుర్రం కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత గుహల మధ్య సన్నటి కాంతి రావడానికి వారు గమనించారు భూపాలకు వెళ్లి చూడగా కుర్రం రాళ్ల మధ్యలో చిన్న బంధువుగా మారడాన్ని గుర్తించారు ఇది తమ కుల దైవమైన పద్మనాభుడి మహిమ అని తలిచి ఏకశిరతో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభి ంచారు

పెరుగుతున్న రూపము రెండు రాతి పలకల మధ్య చిన్న బిందువు రూపంలో వెలసిన స్వామి రూపం క్రమంగా పెరుగుతూ వస్తుందని అర్చకులు చెబుతున్నారు ప్రస్తుతం శంకు చక్రాలు ధరించిన లక్ష్మీ అనంతపద్మనాభుడి రూపంలో భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు




No comments:

Post a Comment