Wednesday, 7 February 2024

నేడు మేడారంలో గుడి మెలిగే పండుగ

 తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రారంభ సూచికగా భావించే తొలి పూజ బుధవారం జరగనుంది ఈనెల 21 నుంచి 24 వరకు గిరిజన జాతర జరగనుండగా సనాతన ఆచారం ప్రకారం మనదేవతల వడ్డీలు పూజారులు బుధవారం గుడి మెలిగే పండుగ నిర్వహించనున్నారు ఈ తంతుతో జాతరకు అంకురార్పణ జరిగినట్లు భావిస్తారు జాతరలో భక్తుల పూజలు అందుకునే ప్రధాన దేవతలు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల పూజా మందిరాలు గతంలో గడ్డి గుడిసెలుగా ఉండేవి మహా జాతరకు రెండు వారాల ముందు పాతబడ్డ పైకప్పు కర్రలను తొలగించేవారు ఆదివాసి సంప్రదాయాల ప్రకారం దేవుళ్లకు పూజలు చేసి గుడి శుద్ధి కార్యక్రమాన్ని జరిపేవారు దీనిని గుడి మెలిగే పండుగగా పిలుస్తారు కాలక్రమంలో గడ్డి గుడిసెల స్థానంలో శాశ్వత ప్రాతిపదికన పూజా మందిరాలు నిర్మితమయ్యాయి అయినా సంప్రదాయాలు కొనసాగింపుగా పూజారులు గుడి మెలిగే తంతును జరుపుతూ వస్తున్నారు బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క కన్యపల్లిలోని సారాలమ్మ కొండాయలోని గోవిందరాజు పూనుగుండ్లలోని పగిడిద్దరాజు ఆలయాల్లో వడ్డెలు సంప్రదాయ పూజలు చేస్తారు ఆ తర్వాత ఆలయాలను శుద్ధి చేయనున్నారు అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు జాతర ప్రారంభ సూచికగా తొలి పూజ జరుగుతుండటంతో బుధవారం వనదేవతల గద్దెల దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు మేడారం తరలిరానున్నారు వచ్చే బుధవారం ప్రధానమైన  మండ మెలిగే పండుగ జరగనుంది



No comments:

Post a Comment