Wednesday, 7 February 2024

కర్ణాటక సంగీత పితామహుడు

 దాసరేంద్ర పురంధర దాసరాయ. దాసభక్తులలో పురంధర దాసు శ్రేష్టుడు.. అని రాజ గురువు వ్యాస తీర్తులతో ప్రశంసలు పొందిన పురంధర దాసు ప్రథమ కర్నాటక సంగీత విద్వాంసుడు అసలు పేరు శ్రీనివాస నాయక పురంధర దాసు క్రీస్తుశకం 1484లో కర్ణాటకలో శివముగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా అరగలోని ఓ సంపన్న వర్తక కుటుంబంలో జన్మించాడు సంప్రదాయ విధానంలో కన్నడ సంస్కృతాలతో పాటు సంగీతము అభ్యసించిన పురందరదాసు కు పదహారేళ్ళకే సరస్వతీ బాయ్ తో వివాహమైంది కాలక్రమంలో సంపద మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం వల్ల కలిగే అనర్ధం గ్రహించి తన 30వ ఏటని సంపాదనంతా త్యాగం చేసి పరమ భక్తుడై పురందరదాసుగా మారి కర్ణాటక సంగీత పితామహుడు అయ్యాడు రచయితగా వాగ్గేయకారుడిగా పరమ భక్తునిగా హరిదాసునిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకు రాజ గురువైన వ్యాస తీర్పుల నుండి హరిదాస దీక్ష చేసి పురందర విట్టల కలం పేరుతో తన కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితం ఇస్తూ పురంధర విట్టలా అనే పదం మకుటంతోనే ప్రతిపాటను ముగించేవాడు తిరుపతి శ్రీరంగం బేలూరు ఓడిపి పండరీపురం లాంటి అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ ఆయా దేవుళ్ళపై వేలాది సంకీర్తనలను రచించాడు అయితే సుమారు 1000 సంకీర్తనలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం అంటూ భక్తి పారవశ్యంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ పురందరదాసు రాసిన సంకీర్తన ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిందే పురందరదాసు కోసం శ్రీకృష్ణదేవరాయలు ఓ జపషాలను నిర్మించారు అది హంపిలో పురందర మండపముగా పాసికి 1564 పురం ధర దాసు కాల ధర్మం చెందాడు ప్రతి ఏడాది పురందరదాసుని పుణ్యస్థితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో ఆయన ఆరాధన ఘనంగా జరుపుతారు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆయన పుణ్య చితిని పురస్కరించుకొని ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పురందరదాసుల వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు..



No comments:

Post a Comment