పుష్య మాసం జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా కేసులాపూర్ నాగోబా జాతర వార్తల్లో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత ఆదివాసీలు జరుపుకొని అతిపెద్ద జాతర ఇది పేరుపొందింది ఇది అందమైన జాతర కూడా పుష్య మాసం ఆదిలాబాద్ జిల్లాలో రాజ్ గూండ్లతో సహా ఆదివాసీలందరికీ పెద్ద పండుగ సమయం రాజు గోండుల్లో వేరువేరు ఇంటిపేరుల వారు తమ గోత్రపు పెరసపేన్ లేక ఆదిదేవులను గుర్తు చేసుకుంటూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయా క్షేత్రాలకు వెళ్లి చేసే పలు జాతర్లలో కేస్లాపూర్ నాగోబా జాతర ఒకటి నిజానికి కేస్లాపూర్ మేస్త్రం అనే ఇంటి పేరు ఉన్న రాజు గోండుల ఆది దేవుని క్షేత్రం కానీ మేస్త్రం ఇంటి పేరు ఉన్న ఏడు దేవతల గోత్రపు రాజు గోండులు ఎక్కువ సంఖ్యలో ఉండడం దాదాపు 2500 కుటుంబాలు వల్ల వాళ్లతో పెళ్లి సంబంధాలు ఉన్న ఇతర గుండులు కూడా తప్పనిసరిగా జాతరలో పాల్గొనవలసి ఉన్న కారణంగా నాగోబా జాతర కార్యక్రమంలో గోండులందరి జాతరగా ఇతర ఆదివాసీలు ఆదివాసీదారులు కూడా ఈ సమయంలో దర్శించే క్షేత్రంగా రూపుదిద్దుకుంది
తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు మిశ్రమం వంశీయులు నాగోబా ఆలయం నుండి పవిత్ర కలశాన్ని తీసుకుని వెళ్లి గోదావరి నది నుండి నీళ్లు నింపుకొని ఆ కలశాన్ని కాలయాత్రన ఒకే వరుసలో నడుస్తూ తీసుకొచ్చి దృశ్యం ఒక దృశ్య కావ్యంలా సాగుతుంది జాతర మొదలయ్యే సమయానికి తమ తమ గ్రామాల నుండి గుంపులుగా గుడి ఎడ్లబండ్ల మీద ఇప్పుడు మోటార్ వాహనాల మీద కూడా మేస్త్రం కుటుంబాల వారు అక్కడక్కడ విడిది చేస్తూ వెళ్లే దృశ్యాలు ఆదిలాబాద్ జిల్లా అంతట ఈ మాసంలో దర్శనమిస్తుంటాయి నాగోబా పూజా సామాగ్రిని ఆయా కుటుంబాల స్త్రీలు తలమీద గంపల్లో పెట్టుకొని తప్పనిసరిగా కాలినడకని ఈ గుంపుల వెంబడి నడిచి వస్తారు ఇలా రెండు రకాలుగా సాగుతుంది ఈ జాతర యాత్ర 29 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉన్న కేస్లాపూర్ నాగోబా నాగదేవత క్షేత్రంలో ఊడలు కట్టిన పురాతనమైన మర్రిమానుల వద్దకు పవిత్ర కలశం ముందు చేరుకుంటుంది ఆ తర్వాత అక్కడి నుండి నాగోబా ఆలయానికి బయలుదేరి వెళుతుంది ఐదు రోజులపాటు చూడ చక్కనైన ఆచార కర్మలు పూజా కార్యక్రమాలతో మేస్త్రం వంశీయులు జరుపుకునే సంబరంలో లెక్కలేనని విశేషాలు కనిపిస్తాయి వంశపు తొలివాడైన పడ్యూర్ తమ వంశపు ఆరాధ్య దేవతగా నాగోబాను కనుగొని తమ నివాస ప్రాంతంలోని కేస్లాపూర్ గ్రామం వద్ద శాశ్వత విగ్రహ దేవతగా ఉండేలా ఎలా చేశాడో పెద్ద పురాణంగా జాతర సమయంలో మేస్త్రి ప్రధాని గాయకులు దానం చేసి వినిపిస్తారు ఇది ఇక్కడ కనిపించే ఒక విశేషం
జాతర వైభవం ఇలా ఉండగా గత ఆరేండ్లలో కేసులాపూర్ లో వచ్చిన పెద్ద మార్పు అక్కడ ఓ అద్భుత దేవాలయ నిర్మాణం రూపుదిద్దుకోవడం పేద రైతుల నుండి ఉద్యోగస్తుల దాకా మిశ్రమ వంశీయులందరూ ఐదు సంవత్సరాలపాటు చందాలు వేసుకుని కూడగట్టిన నాలుగున్నర కోట్ల డబ్బు వల్ల ఇది సాధ్యమైంది ప్రభుత్వం అందించే తోడ్పాటు ఉండగా తమ సొంత కృషితో భవిష్య తరాలకు ఒక కానుకగా నిలిచిపోవాలన్న ఆశయంతో తాము సమిష్టిగా నిర్ణయించుకొని ఈ పనికి పూనుకున్నామని కేశలాపూర్ గ్రామ పటేల్ మేస్త్రం వెంకట్రావు స్వయంగా పరిశోధకులు విద్యావేత్త కూడా అయినా పర్ధాన్ మేస్త్రి మనోహర్ తెలిపారు మేస్రం వంశీయులు ఆలోచనలు అభిప్రాయాలకు అనుగుణంగా విజయనగర శైలిలో ఆలయాన్ని రూపకల్పన చేసి ఒక కళాఖండాన్ని అవతరింపజేసిన ఘనత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కు చెందిన సంప్రదాయ శిల్పి తలారి రమేష్ మరియు ఆయన బృందానికి దక్కుతుంది ఆలయ నిర్మాణానికి అహోబిలం ఆలయంలో వాడిన ఎర్ర రాతిని నాగోబా మూల విగ్రహానికి కంచి ప్రాంతంలో దొరికే కృష్ణశిలని వాడారు నాగోబా పౌరాణిక గాథలోని పలు ఘట్టాలను రాజు గోండుల రాసిన సాంస్కృతి అంశాలను వైభవాన్ని తెలియజేసే ఇతివృత్తాలను ఆలయ స్తంభాల్లో ఆలయ పీఠం చుట్టూ ఒక దృశ్య కావ్యంలా ఉపకల్పన చేసి నిలిపారు ఎర్ర రాయి కాంతిని ప్రతిఫలించే ప్రత్యేకతను కలిగి ఉన్న కారణంగా సూర్యకాంతి మారుతున్న తీరును బట్టి ఆలయంలోని శిల్పాలు పలు వారణాల్లో దర్శనమిస్తాయి ఒకప్పుడు గడ్డి కప్పుతో ఉన్న సాదాసీదా గుడి కాలక్రమంలో పెరుగుతూ ఇప్పుడు గొప్ప వాస్తు శిల్పాలతో భవ్యమైన ఆలయంగా అవతరించడం భారతదేశపు ఆదివాసీల ఆధునిక చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం మధ్య భారత దేశంలో ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యాలు ఏలిన గోండుల ప్రాచీన వైభవానికి ప్రతీకగా కూడా నాకోబా ఆలయం నిలిచిపోతుంది ఇప్పుడు ఇక ఏడాది అంతా దర్శించుకోదగిన సరికొత్త పుణ్యక్షేత్రం పర్యాటక స్థలంగా కేస్లాపూర్ నాగోబా ఆలయం మారిపోయింది

No comments:
Post a Comment