Friday, 9 February 2024

మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు

 


4000 మంది పారిశుద్ధ్య సిబ్బందితో వర్క్స్ జంపన్న వాగుకు 14న లక్నవరం నీళ్లు ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతరకు డ్యూటీలో 14,000 మంది పోలీసులు ములుగు ఎస్పీ శబరి ష్

ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారుతో కలిసి గురువారం మేడారంలోని హరిత హోటల్లో మీడియా ఇంటరాక్షన్ నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ మహా జాతరలో శాశ్వత తాత్కాలిక అభివృద్ధి పనులు జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించింది అన్నారు మంత్రి సీతక్క సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనుల్లో 95% కంప్లీట్ అయ్యాయి అన్నారు జాతరలో గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ప్రాంతాల్లో గిరిజన పెయింటింగ్స్ వేయిస్తున్నామన్నారు అలాగే 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచామన్నారు ఐటిసి సింగరేణి సంస్థల సహకారంతో స్పెషల్ మిషనరీని తెప్పించి పారిశుద్ధ్య పనులు చేయిస్తామన్నారు జాతర టైంలో ప్రతి ఆరు గంటలకు 1400 మెట్రిక్ టన్నుల వేస్టేజ్ జనరేట్ అవుతుందన్నారు యానిమల్ కంపోజ్ టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లలో 279 యూనిట్ల ద్వారా 5532 టాయిలెట్స్ ఏర్పాటు చేశామని అన్నారు కొత్తగా 20030 కొత్త బోర్ వెల్స్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాల్లో ప్రతి ప్రదేశాల్లో గజ ఈతగాలను నియమించామని అన్నారు జంపన్న వాగులు, మోకాలు లోతు నీళ్లుండే విధంగా చూస్తామని ఈనెల 14న లక్నవరం నీటిని రిలీజ్ చేస్తామన్నారు అయితే ఆరోగ్యశాఖ తరఫున 30 స్పెషల్ హెల్త్ క్యాంప్స్ 6 అంబులెన్స్లను అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ దగ్గర ప్రత్యేక వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు వనదేవతలు వచ్చే టైం లో స్పెషల్ టెక్నాలజీ ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ జాతరలో 14,000 మంది పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహిస్తారన్నారు మనదేవతలను తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అప్పుడు రోప్ పార్టీ ద్వారా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించనున్నట్లు చెప్పారు 500 సీసీ కెమెరాలు ఐదు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామన్నారు వీఐపీఐపీల దర్శనం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు ఈనెల 23న జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నందున పట్టిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు మహా జాతర వన్వే రూట్లు పార్కింగ్ స్థలాలను తెలిపే మొబైల్ యాప్ను ఈ నెల 13న రిలీజ్ చేస్తామన్నారు ఐటిటిఏ పీవో అంకిత అడిషనల్ కలెక్టర్ పి శ్రీజ ఏటూరి నాగార్జున అడిషనల్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త దేవాదాయ శాఖ ఆఫీసర్ రాజేందర్ పాల్గొన్నారు


No comments:

Post a Comment