అయోధ్య మధుర గయా కాశీ కంచి అవంతికాపురి ద్వారావతి చైవ ససైతా మోక్షా దాయికా ఊక్త సప్త పురి భ్యో కపి, హ్యా ధి కై షా పురి మాతా అత్రెక్త. ది ననాసేన సంత వాంవ ఫలం లభేత్..
భూలోకంలో ఏడు ముక్తి ధామాలు ప్రసిద్ధిగాంచినది కానీ ఏక చక్ర నగరంలో ఒకేరోజు ఉంటే ఏడు ముక్తిదామాల్లో ఉన్న పుణ్యం లభిస్తుంది. అందుకే ఇక చక్ర నగరాన్ని మరో ముక్తి ధామం అంటారు పరుశురాముడు ఆలయాన్ని నిర్మించే ప్రతిష్టించిన శివలింగమే ఏక చక్రేశ్వరుడు
ఏక చక్రపురం బోధన్ పరుశురాముడు ఆలయ నిర్మాణం 1959లో పుష్య బహుళ అమావాస్య రోజున వెలుగు చూసిన చారిత్రక కట్టడం సాలగ్రామశిల తో చేసిన శివలింగం నేడు ఆవిర్భావ వేడుకలు
క్షత్రియ వంశ సంహారానికి నడుం బిగించిన పరుశురాముడు 21సార్లు ఏక చక్ర పురానికి బోధన్ కు వచ్చినట్లు ఏక చక్ర మహత్యం చెబుతోంది పరమేశ్వరుని భక్తుడైన పరశురాముడు తాను ఎక్కడికి వెళ్లినా శివాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి ఏకచక్రపురం బోధన్ సందర్శించిన పరశురాముడు చక్రతీర్థం ప్రస్తుతం చెక్కిచెరువు ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపే వాడని ఆ సమయంలో చక్రేశ్వరాలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్టించే నిత్యం పూజలు చేసేవారని చరిత్ర చెబుతోంది ప్రీత యుగంలో పరుశురాముడు ఆలయం కార్యక్రమంలో మట్టితో కప్పబడి 1959లో పుష్య బహుళ అమావాస్య రోజున బయటపడింది నాలుగు వైపులా ద్వారాలతో మండపం రూపంలో బయటపడిన ఈ ఆలయం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది నాలుగు రాతి స్తంభాలు పైన రాతి కప్పు మధ్యలో శివలింగం ఉన్నాయి ఇక చక్రపురంలో వెలసిన ఆలయం కావడంతో అప్పటినుంచి ఏక చక్రేశ్వరాలయంగా పిలుస్తున్నారు ఆ తర్వాత ఆలయానికి మూడు వైపులా గోడలు నిర్మించి పశ్చిమ అభిముఖ ద్వారాన్ని ఏర్పాటు చేశారు దీంతో పశ్చిమాభిముఖి శివలింగం ఉండటం చాలా అరుదని మరింత ప్రసిద్ధిగాంచింది ప్రతిరోజు భక్తుల సందర్భంగా ఆలయం కిటకిటలాడుతుంది
65 ఏళ్ల వేడుకలు ఇక చక్రయేశ్వరాలయ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆలయ కమిటీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు మొదటి రోజైన బుధవారం గణపతి పూజ అన్నపూర్ణ అమ్మవారి కుంకుమార్చన గురువారం నవగ్రహ సర్పదోష నివారణ కోసం నవగ్రహ పూజా కార్యక్రమాలు పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకొని శుక్రవారం ఏక చక్రేశ్వర స్వామి జన్మదిన వేడుకలను వాయి భవంగా నిర్వహించానున్నారు అభిషేకం రుద్ర స్వాహాకారము హారతి మంత్రపుష్పము కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం భక్తులకు అన్నదానం చేయనున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు పాలకవర్గం ప్రతినిధులు కోరారు



No comments:
Post a Comment