Thursday, 8 February 2024

భక్తుల కొంగు బంగారం అల్లమా ప్రభు జాతర

 





నసురుల్లాబాద్.. కోరిన కోరికలు నెరవేర్చేవాడు భక్తుల కొంగుబంగారం అల్లమా ప్రభు అని ఇక్కడ భక్తుల నమ్మకం ధర్మం నశించి పాపం పెరిగినప్పుడు ధర్మ జాగృతికి మహాపురుషులు ఈ జగత్తును ఉద్భవిస్తారని అల్లమా ప్రభు కూడా మానవాళికి మార్గదర్శనం చేసేందుకు శివ పరమాత్ముని రూపంతో భూమిపై జన్మించాడని పెద్దల భావన కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా షికారిపూరి తాలూకాలోని బల్లి గారి అల్లమా ప్రభు జన్మస్థలం తన గురుద్వారా పొందిన ఆత్మలింగాన్ని తీసుకొని దేశ సంచారం చేస్తూ కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవనపల్లి గ్రామంలోని కొండపై లింగాన్ని మాఘమాసంలోని అమావాస్య రోజున ప్రతిష్టించారు అప్పటినుంచి ఈ కొండ అల్లమా ప్రభు కొండగా పేరుగాంచింది నేటి నుంచి అగ్నిగుండం అన్నదానం శనివారం రథోత్సవం నిండు జాతర 11న కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు దళిత వర్గానికి చెందిన వారి పూజారు పూర్వం దళితులు ఆలయంలోనికి వస్తే అడ్డుకునేవారు కానీ ఈ ఆలయంలో మాత్రం కొండపై శివాలయం ఏర్పడిన నాటి నుంచి దళిత వర్గానికి చెందిన వారే పూజారిగా కొనసాగడం విశేషం ప్రస్తుతం అనిత రామవ్వ అనే మహిళలు పూజారులుగా కొనసాగుతున్నారు ఎప్పటికీ ఎండని కుంట అల్లమా ప్రభు మహిమతో అన్ని కాలాల్లో కూడా కొండపైకి వెళ్లే దారిలో ఉన్న కుంటలో నీరు ఎండిపోకుండా ఉంటుంది ఈ నీటిని తీసుకొని కొండపై ఉన్న ఆత్మ లింగాన్ని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢనమ్మకం అల్లముని శిష్యులైన బసవన్న సిద్ధప్పలు దీనిపై ప్రచారం చేశారు ఈ నీరు లభించే ఈ ప్రాంతాన్ని సిద్ధన్న పేరు మీదుగా అక్కడే బసవన్న కూడా ఇప్పటికీ భక్తులు పూజిస్తారు












No comments:

Post a Comment