Wednesday, 7 February 2024

భగవద్గీతతో జీవితం సార్థకం

 రెండో రోజు కొనసాగిన సాధు సమ్మేళన చతుర్ధ మహాసభ

లోకంలో అన్నింటికంటే సత్సంగమే గొప్పదని పీఠాధిపతులు ప్రవచించారు మానవులు తమ జీవితాలను సార్ధకం చేసుకోవాలంటే భగవద్గీతను తప్పక అనుసరించాలని పేర్కొన్నారు డిచ్పల్లి మండల కేంద్రంలోని వేడుకల కేంద్రంలో రెండో రోజు సాధు సమ్మేళన చతుర్ధ మహాసభలు కొనసాగాయి సభలో తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం వశిష్టాశ్రమాధిపతులు స్వరూపానందగిరి స్వామి సాంఖ్యయోగంపై ప్రవచించగా వశిష్ట సంచార సత్సంగ సంస్థాపక అధ్యక్షుడు సచ్చిదానందగిరి స్వామి విష్ణు సేవానందగిరి స్వామి కరీంనగర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం గురించి తెలిపారు రాజరత్నం గురూజీ మెట్పల్లి పంచ కోశాలు సద్విచార సిద్ధి సమాధి యోగం పై మాట్లాడారు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు హాజరయ్యారు కార్యక్రమంలో ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామి హైదరాబాద్ భూమాత్మానందమహారాజు కృష్ణానంద స్వామి కామారెడ్డి విష్ణు సేవానందగిరి స్వామి శుద్ధ బ్రహ్మానందగిరి స్వామి నిర్మలానందగిరి స్వామి షీలానందగిరి మాతాజీ హరిప్రియ నందగిరి మాతాజీ తదితరులు పాల్గొన్నారు




No comments:

Post a Comment