అయోధ్యలో ఐదు శతాబ్దాల తర్వాత బాలరాముడు ప్రాణ ప్రతిష్ట జరగడంతో దేశమంతా సంబరాలు మునిగిపోయింది మాకూరులో మాత్రం పనులు ప్రారంభమై పదేళ్లు దాటిన రాములు దర్శన భాగ్యం ఇంకా కలగడం లేదు ఈ క్రమంలో తమ కల ఎప్పుడు సహకారం అవుతుందోనని గ్రామస్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు
పది సంవత్సరాల క్రితం దేవుడు కోసం స్థానికులు అందరూ ఏకమయ్యారు 30 గుంటల విస్తీర్ణంలో రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముందుగా ఎనిమిది లక్షల రూపాయల గ్రామాభివృద్ధి కమిటీ నిధులతో పనులు మొదలుపెట్టారు తర్వాత ఇంటికి 500 రూపాయలు చొప్పున పోగు చేశారు ఉద్యోగులు వ్యాపారులు పెద్ద భూస్వాములు ఒక్కొక్కరు స్వచ్ఛందంగా 5000 రూపాయలకు పైగా విరాళం ఇచ్చారు సొంతూరులో గుడి నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 10 లక్షల రూపాయలు ప్రముఖ గుత్తేదారు పెద్దోళ్ళ సురేందర్రావు 10 లక్షల రూపాయలు అందజేశారు ఆ పైసలతో పనులను వేగవంతం చేశారు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి సూచనల మేరకు చెన్నై శిల్ప కళాకారులు వాస్తు ప్రకారం ఆలయాన్ని అందంగా నిర్మించారు ఆలయ కమిటీ వారు కాటారం అడవుల నుంచి ధ్వజస్తంభం తెప్పించారు సుమారు కోటి రూపాయల వ్యయంతో ఇప్పటివరకు 95% పనులు పూర్తయ్యాయి కేవలం రంగులు వేయడం టైల్స్కు పాలిచ్చేయడం ధ్వజస్తంభానికి తుదిమెరుగులు దిద్దడం ఇలాంటి చిన్నపాటి పనులు మాత్రమే మిగిలిపోయాయి మతసామరస్యానికి ప్రతీక మాట్లూరు వాసులు మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తున్నారు జనాభాలో హిందువులు ముస్లింలు సమానంగా ఉంటారు ఊర్లో ఎప్పుడు కూడా మతపరమైన గొడవలు చోటు చేసుకోలేదు అందరూ కలిసిమెలిసి ఉంటారు రామాలయం కోసం రఫత్ అనే యువకుడు 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ముస్లిం వ్యాపారుల సైతం ఔదార్యాన్ని చాటుకున్నారు రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్టాపన కమ్మరి నరేందర్ వీడిసి అధ్యక్షుడు కొన్ని కారణాల వల్ల రామాలయం సకాలంలో ప్రారంభించలేకపోయాను రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్టాపన చేస్తాము గుడి కోసం హిందువులతో పాటు ముస్లిం వ్యాపారులు సహకరించడం ఎంతో సంతోషంగా ఉంది.

No comments:
Post a Comment