Monday, 5 February 2024

ఆలయాలకు భక్తుల పాదయాత్ర

 




గాంధారితోపాటు పోతంగల్ కలాం సర్వాపూర్ మేడిపల్లి గండిపేట్ గౌరారం సితాయి పల్లి ముద్దేల్లి తదితర గ్రామాలకు చెందిన పలువురు విఠలేశ్వరుని భక్తులు ఆదివారం పాదయాత్రగా మహారాష్ట్రలోని పండరీపూర్ కు బయలుదేరారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలోని మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు భజనలు చేస్తూ పాటలు పాడుతూ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు మార్గమధ్యంలో సర్వాపూర్ విఠలేశ్వరాలయం మురళి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరీపూర్ చేరుకోవడానికి 13 రోజుల సమయం పడుతుందని భక్తులు తెలిపారు మద్దూర్ నుంచి పలువురు భక్తులు బీర్కూరు మండలంలోని నెమిలి సాయిబాబా ఆలయానికి ఆదివారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు ఉదయం సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన అనంతరం గ్రామ ప్రత్యేకాధికారి డాక్టర్ విజయకుమార్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు సాయి పల్లకి వ్రతం వెంట పాటలు పాడుతూ పాదయాత్ర కొనసాగించారు మార్గమధ్యంలో ఆయా గ్రామాల్లో దాతలు పాదయాత్ర భక్తులకు అల్పాహారం భోజనం మజ్జిగ తాగునీరు అందజేశారు





No comments:

Post a Comment