Sunday, 11 February 2024

మితాహారం

 యోగ సాధన చేయ కోరేవారు అలవర్చుకోవాల్సిన లక్షణాలను గురించి ప్రస్తావిస్తూ అతిగా తినేవారికి అత్యశ్న త :..యోగ సాధనలు సాధ్యం కావు అలాగని బొత్తిగా ఆహారం తీసుకొని వాళ్లకు..ఏకాంతం అనశ్నత : కూడా అవి సాధ్యం కావు అంటుంది భగవద్గీత..

యోగ శాస్త్రం మాట అలా ఉంచిన ఆహార విషయంలో పరిమితులలో ఉండకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆధునిక వైద్యశాస్త్రం కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది వ్యక్తుల శరీర తత్వాలు వేరువేరుగా ఉంటాయి కనుక మనిషన్నవాడు ఎన్ని గ్రాములు ఆహారం తీసుకోవాలని పరిమితి నిర్ణయించడం కుదరదు అయితే అవసరం మేరకే ఆహారం తీసుకోవాలన్న స్పృహ ఉన్నవాళ్లకు వాళ్లకు వర్తించే పరిమితి ఏమిటో అనుభవం ద్వారా వాళ్లకే తెలుస్తుంది కడుపు నిండినప్పుడు కడుపు నిండిన విషయం తెలిసినట్టే

గీతలో పై శ్లోకానికి భాష్యం చెబుతూ ఆదిశంకరులు రెండు ప్రాచీన సూత్రాలను ఉటంకిచారు  ఒకటి శత పథ బ్రాహ్మణంలో మాట ఈ బ్రాహ్మణ నేటికీ సుమారు 3 వే ల ఏళ్ల నుంచి జగమెరిగి ఉన్న శృతి శరీర అవసరాలకు సరిపడేట్టుగా భుజించే అన్నం రక్షిస్తుంది అది బాధించదు యదుహ వా ఆత్మ సమ్మితం అన్నం తత్ అవతు, తత్ న హినస్తి.. అంతకంటే ఎక్కువ భుజిస్తే అది బాధిస్తుంది అలాగే అంతకంటే తక్కువ ఆహారం తీసుకుంటే అది రక్షించలేదు బాధిస్తుంది అని

ఎంత ఆహారం అయితే మితాహారం అవుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా ఆచార్యుల వారి భాష్యం మరో ప్రాచీన శ్లోకాన్ని ఉతంకిస్తుంది అర్థం సవ్యంజనం అన్నస్య తృతీయ ఉదకస్య చ వాయు సంచరనార్థంతో చతుర్ధం అవశేష ఏత్ ఉదరంలో సగభాగం అన్నానికి కూరలకు మూడోపావు నీటికి నాలుగో పావు వాయుసంచారానికి వదిలివేయాలి అని

ఏ ఆహారమైనా ఎంత స్వీకరించినా అదేదో రోజుకు రెండుసార్లు మాత్రమే స్వీకరించి మిగతా సమయంలో కేవలం జలం మాత్రమే పుచ్చుకోవడం మంచిదని అలా చేసేవాడు నిత్యోపవాసి కింద భావించబడతాడని మహాభారతంలో భీష్ముడు చెప్పిన ధర్మాలలో కనిపిస్తుంది ఆహార సూత్రాలు అప్పటి నుంచే ఉన్నాయి ఆచరించే క్రమశిక్షణకే ఇప్పటికీ కొరత

No comments:

Post a Comment