15 వరకు కేసులాపూర్ లో మహా జాతర 12న గిరిజన ప్రజా దర్బార్..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో నాగోబా మహా జాతరకు సర్వం సిద్ధమైంది ఏటా పుష్య మాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు మిశ్రమ వంశీయులు మహా పూజ నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది నాగోబాకు శుక్రవారం అర్ధరాత్రి మిశ్రమ వంశీయులు మహా పూజ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు దేవాదాయ శాఖతోపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు కు దాదాపు 2020 కిలోమీటర్లు మిశ్రమం వంశీయులు కాలినడకన వెళ్లారు గోదావరి వద్ద గల హస్తాల మడుగు వద్ద పంచలింగాలకు పూజ చేసి పవిత్ర జలాన్ని తీసుకువచ్చారు ఈ పవిత్ర జనంతో శుక్రవారం అర్ధరాత్రి నాగోబాకు అభిషేకంతో ప్రారంభమయ్యే మహా జాతర 15వ తేదీ వరకు కొనసాగనున్నది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర చత్తీస్గడ్ ఒడిశా కర్ణాటక మధ్యప్రదేశ్ బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు విదేశాల నుంచి పర్యాటకులు సందర్శకులు వచ్చి నాగోబాను దర్శించుకుని పూజలు చేస్తారు జాతరలో భాగంగా 12న ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు






No comments:
Post a Comment