నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మను దేవి పల్లిలో ఉన్న అల్లమా ప్రభు జాతరలో శనివారం రథసప్తమి నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిగుండం నిర్వహించి భక్తిశ్రద్ధలతో నిప్పులపై భక్తులు నడిచారు శనివారం ఆలయ ప్రాంగణంలో గతాన్ని అలంకరించి ఆలయ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
నేడు కుస్తీ పోటీలు బొమ్మందేవ్ పల్లిలో జరిగే అల్లమా ప్రభు జాతరలో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ పోటీల్లో పాల్గొనడానికి కర్ణాటక మహారాష్ట్ర నుండి మల్ల యోధులు వస్తున్నట్లు పేర్కొన్నారు ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వీరులకు బహుమతులు అందిస్తామన్నారు
No comments:
Post a Comment