Saturday, 10 February 2024

ధ్యానంతో ఆత్మజ్ఞానం

 నవీపేట్ మండలంలోని జన్నేపల్లి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో శనివారం మండల మాస్టర్లచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఎస్ఎస్ఎన్ నిజామాబాద్ అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ధ్యానం శాఖాహారం పిరమిడ్ల నిర్మాణం గురించి వివరించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలని విస్తృతంగా పిరమిడ్లు నిర్మించాలని ప్రతి ఇంటికి కరపత్రాలను పంచాలని అన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుఖాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండలంలో విస్తృతంగా జ్ఞాన ప్రచారం చేయడానికి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సుఖాల లక్ష్మణ్ పిరమిడ్ మాస్టర్ గురడి దేవదాస్ దాసరి రాజు జన్నేపల్లి రాజు మాస్టర్ పాల్గొన్నారు.





No comments:

Post a Comment