Wednesday, 7 February 2024

29న బోధనలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన

 బోధన్ పట్టణ నడి బొడ్డున చావిడి సమీపంలో ఫిబ్రవరి 29వ తేదీన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ ప్రముఖులు మంగళవారం బోధన పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు బాగారెడ్డి మాట్లాడుతూ పురాతన కాలం నుంచి చావడి సమీపంలో ఉన్న హనుమాన్ మందిరం శిథిలావస్థకు చేరడంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతన ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు ఈ ఆలయంలో ఫిబ్రవరి 29వ తేదీన నూతన హనుమాన్ మందిర విగ్రహం ఘనంగా ప్రతిష్టిస్తున్నామని తెలిపారు అలాగే మార్చి ఒకటి రెండు తేదీల్లో ఘనంగా ప్రత్యేక పూజలు మహా యజ్ఞం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కావున ఈ మూడు రోజులపాటు జరిగే ఈ మహోత్సవ భక్తి కార్యక్రమంలో భక్తులు పట్టణవాసులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు సమావేశంలో గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు పట్టణ ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment