Monday, 5 February 2024

ఆధ్యాత్మిక సమాచారం ఫిబ్రవరి 5 2024

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహుడు ఆలయంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి కుంకుమార్చన పుట్టు వెంట్రుకలు ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ నిర్వాహకులు అర్చకులు పాల్గొన్నారు

నసురుల్లాబద్ మండలం మైలారం గ్రామ శివారులోని కొచ్చర మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి అర్చనలు అభిషేకాలు చేపట్టారు అనంతరం మొక్కులు తీర్చుకున్నారు



నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద గ్రామంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో గ్రామ పురోహితుడు దిగంబర శర్మ వేద పండితులు నిర్వహించారు తులత వెంకటేశ్వర కళ్యాణం జరిపించారు అనంతరం 108 జంటలచే సామూహిక సత్యనారాయణ వ్రతాలను చేయించారు
పండరీపూర్ కు పాదయాత్ర నుంచి సుమారు 200 మంది బార్కారి భక్తులు పాదయాత్రగా పండరీపూర్ ఆదివారం బయలుదేరారు ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజులు వార్కారి భక్తులను సన్మానించారు భక్తితో మానసిక ప్రవర్తనలు మార్పు కలుగుతుందని చెప్పారు భక్తుడు నందు కిషన్ రావు గంగాధర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రావు బాబా రాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో వంటగది విద్యుద్దీకరణకు అవసరమైన 21 వేల రూపాయల సామాగ్రిని ఎల్లారెడ్డి లోని హరి ఎలక్ట్రానిక్ దుకాణం యజమాని ప్రకాష్ ఆదివారం అందజేశారు సొసైటీ వైస్ చైర్మన్ కొరివి ఎల్లప్ప గణపతి రాజు ఉన్నారు


No comments:

Post a Comment