Sunday, 4 February 2024

ముగిసిన త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలు

 వేముల వాడ రాజన్న ఆలయం లో ఐదు రోజులుగా కొనసాగుతున్న సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవాలు శని వారం ముగిశాయి. కర్ణాటక వాగ్గేయ కారుడు శ్రీ త్యాగ రాజ స్వామి జయంతి సందర్భంగా వేముల వాడ రాజన్న ఆలయం లో ఈ ఉత్సవాలు నిర్వహించారు.ఉత్సవాల్లో చివరి రోజు నెదర్లాండ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ కార్య కర్త సుసాన్ సమాధానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేలను రక్షిస్తేనే భవిష్యత్ తరాలను కాపాడుకో గలుగుతామని అన్నారు.



No comments:

Post a Comment