మేడారం జాతరకు సంబంధించిన మార్గ సూచి రూట్ మ్యాప్ ని అధికారులు రూపొందించారు జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం దీని ద్వారా తెలుసుకోవచ్చు రహదారుల వెంట పరిసరాల్లో ఎక్కడ ఏముంటుంది ఏ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నాయి ఆర్టీసీ బస్టాండ్ జంపన్న వాగు స్నాన ఘట్టాలు ఎక్కడ ఉంటాయి? గద్దెలకు ఎలా చేరుకోవాలి ఇలా సమాచారం అంతా క్రోడీకరించి రూట్ మ్యాప్ లో పొందుపరిచారు ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి మేడారం వెళ్లేవారికి జాతరకు ఎటువైపు నుంచి వచ్చిన ఇలా చేరుకోవాలి ఎక్కడ ఏముందో తెలుసుకునేందుకు ఈ మ్యాప్ ఉపయోగకరంగా ఉంటుంది
30 పార్కింగ్ స్థలాలు భక్తులు తమ వాహనాలు నిరుపేందుకు 30 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు ఆయా స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపారు ఇందులో ఒకటి వివిఐపి మరొకటి విఐపి మిగతాది సాధారణ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి
పసరా నుంచి వచ్చే వాహనాల కోసం మొట్ల గూడెం ప్రాజెక్టు నగర్ వెంగళపూర్ చింతల్ కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు చిన్న బోయినపల్లి నుంచి వచ్చే వాహనాలు ఊరటం కాటారం నుంచి వచ్చేవి కాల్వపల్లి బయ్యక్కపేట తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి
పెట్రోల్ బంకులు జంగాలపల్లి వస్త్రా మధ్యన 6 బంకులు ఉన్నాయి అలాగే వేటూరి నాగారం చిన్నబోయినపల్లి మంగపేట ప్రాంతాల్లో కాటారం భూపాలపల్లి రాంపూర్ ఘనపురం ప్రాంతాలకు సంబంధించిన బంకుల వివరాలు అందులో పొందుపరిచారు
జాతర పరిసరాలు దవాఖాన ఆర్టీసీ బస్టాండ్ ఐటిడిఏ క్యాంపు కార్యాలయం విశ్రాంతిభవనం చిలకలగుట్ట ఆశ్రమ పాఠశాల పోలీస్ శిబిరం శివరాం సాగర్ చెరువు తాడ్వాయి పోలీస్ స్టేషన్ అక్కడ ఆర్టీసీ హాల్టింగ్ పాయింట్ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం వీటిని జాతర పరిసర ప్రాంతాలుగా గుర్తించారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగుకు పార్కింగ్ స్థలాల నుంచి వెళ్లే దారులు వాగు వెంట స్నాన ఘట్టాలకు సంబంధించిన వివరాలను రూట్ మ్యాప్ లో వివరించారు భక్తులు గద్దెలకు ఎలా చేరుకోవాలి ఏ ఏ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకోవచ్చు చెప్పారు


No comments:
Post a Comment