Monday, 5 February 2024

చిత్త శాంతి

 వ్యాసుడు లోక కళ్యాణం కోసం సమస్త మానవాళికి శుభోదకంగా ఉండేటట్లు మహాభారతాన్ని రచించాడు ప్రజలు తెలుసుకోదగిన జ్ఞానమంతా భారతంలోనే ఉందని పెద్దలు చెప్తారు అంత గొప్ప గ్రంధాన్ని రచించి కూడా వ్యాసుడు చాలా అసంతృప్తిని అశాంతిని అనుభవించాడు తన అశాంతికి కారణమేమిటో అని ఆలోచిస్తుండగా అక్కడికి నారదుడు వస్తా. నారదని చేతిలో ఉండే మహతి అనే వీళ్ళ నుంచి నారాయణ నామం నిరంతరం ధ్వనిస్తూ ఉంటుంది ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తన అమృత ప్రవాహంలో యోగులు పరవశించిపోతారు అటువంటి నారదుడు విచారంగా ఉన్న వ్యాసుని చూసి కారణమడుగుతాడు తనకు కలుగుతున్న అశాంతిని గురించి చెప్పి కారణం చెప్పమంటాడు అప్పుడు నువ్వు నీ గ్రంథంలో విష్ణు కథలు కొంచెం మాత్రంగానే చెప్పారు సమగ్రంగా చెప్పలేదు వాసు దేవుని గుణగణాలు అందంగా వర్ణించి చెప్పాలి. హరినామ సంకీర్తన ప్రధానంగా చేయకపోవటమే నీ మనసులో కొరతకు అశాంతికి కారణం మానవులందరి బాగుందా విముక్తి కోసం భగవంతుని లీలలు సభ్యంగా వర్ణించు జనుల వేదలు తొలగించు ఈ విశ్వమంతా విష్ణుమయం శ్రీహరి లీలామతారాలలోని విక్రమ విశేషాలను వర్ణించు నీకు చిత్త శాంతి లభిస్తుంది అని చెబుతాడు అప్పుడు వ్యాసుడు అశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుని దర్శించాడు ఏ మహా గ్రంథాన్ని విన్నంత మాత్రాన లౌకికమైన సంసార బంధాలపై విరక్తి కలిగి మాధవునిపై అచించిన భక్తి అవర్భవిస్తుందో అటువంటి మహా గ్రంథాన్ని భక్తుల పాలిటి కల్ప వృక్షమైన మహా భాగవతాన్ని రచించాడు చిత్త శాంతి పొందాడు భాగవతం చదివే విని సహృదయ భక్తులకు చిత్త శాంతి లభిస్తుంది. ఇది సద్యో ముక్తిదాయక గ్రంథం

No comments:

Post a Comment