Monday, 5 February 2024

భగవన్నామ స్మరణతో ముక్తికి మార్గం

 


తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఆదివారం రెండో రోజుకు చేరింది సదస్సులో తిరుమల పెద్ద జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు సదస్సుకు ముందు మీరు శ్రీదేవి భూదేవి సమేత మల్లప్ప స్వామికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు తిరుమల పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులను ఆహ్వానించి శ్రీవారి పాదాల చెంత ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు స్వామీజీలు ఆయా సంప్రదాయాల్లో ధర్మ ప్రచారం చేస్తున్నారని వారి విలువైన సూచనలు తీసుకొని టీటీడీ మరింతగా ధర్మ ప్రచారం చేస్తుండన్నారు తిరుమల చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ నామ సంకీర్తన చేస్తే భగవంతుని కృప తప్పక కలుగుతుందని చెప్పారు భగవన్నామ స్మరణతో భక్తుల తమ కష్టాలను దూరం చేసుకుని ముక్తి మార్గం వైపు పయనించవచ్చని అన్నారు టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి జేఈవోలు సదా భార్గవి వీరబ్రహ్మం పాల్గొన్నారు శ్రీవారి సేవలో ప్రముఖులు ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణరావు తెలంగాణ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి బిజెపి నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను శేష వస్త్రాలను అందజేశారు సనాతన ధర్మాన్ని ఏనాడు వ్యతిరేకించలేదు తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి చెప్పారు ధార్మిక సదస్సులో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ స్వామి వారు తన ఆలయం నుంచి గొప్ప సందేశం అందించాలని దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ఇక్కడికి రప్పించాలన్నారు కార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకొని సనాతన హైందవ ధర్మం పరిఢవెల్లిలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఇతర మతాల భక్తులు ముందుకు వస్తే శ్రీవారి పాద కమలాల వద్ద హిందూ ఆచారాలు సంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలపై శిక్షణ ఇస్తామన్నారు.



No comments:

Post a Comment