Thursday, 8 February 2024

ముస్తాబైన ఆలయాలు

 మాఘ అమావాస్య సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు తరలిరానున్న భక్తులు



దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు వద్ద ఉన్న కటిక మల్లన్న ఆలయం శుక్రవారం జరగనున్న మాకు అమావాస్య జాతరకు ముస్తాబయింది ప్రతి ఏటా ఇక్కడ మార్గ అమావాస్య రోజు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు దోమకొండ తో పాటు ముత్యంపేట లింగంపల్లి అంచనూరు సంగమేశ్వర్ భిక్కనూరు మండలం జంగంపల్లి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు

బిక్కనూరు లోని పెద్ద మల్లారెడ్డి లో మాగా అమావాస్య సందర్భంగా గ్రామ శివారులో శుక్రవారం నిర్వహించనున్న దేవేంద్రుని గుట్ట జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు

నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలో శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నరు. ఉదయం కాకడ హారతి మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు

మాచారెడ్డి మండలంలోని గజ్జియా నాయక్ తండా చౌరస్తాలోని శ్రీ వీర హనుమాన్ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం మాఘమాస జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రభు అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట శివారులో ఉన్న నాగమడుగులో మాఘమాసం అమావాస్య సందర్భంగా శుక్రవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు మాఘ మాసం అమావాస్య రోజు మంజీరా లో స్నానమాచరిస్తారు

నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల శివారులో ఉన్న మంజీరా నది బొడ్డున వెలసిన స్వయంభూ లింగేశ్వరాలయం శుక్రవారం జరగనున్న మాకు అమావాస్య వేడుకలకు సిద్ధమవుతుంది బాగా అమావాస్య పురస్కరించుకుని ఆలయంలో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు అన్నదానం చేయనున్నారు



No comments:

Post a Comment