శ్రీ సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులు తమ నివేతు బంగారాన్ని బెల్లాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించేలా ఆన్లైన్ సేవలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో తన మనవడు కొండా మురళీకృష్ణ పేరున మీసేవ వెబ్సైట్లో నమోదు చేసి బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మే వారి గద్దెల వద్ద బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి సురేఖ ఉపయోగించుకున్నారు వివిధ కారణాలతో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోలేని భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు సమ్మక్క సారక్కల పెద్దల వద్ద బంగారం సమర్పించడానికి భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు బుధవారం నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు శాఖ అధికారులు తెలిపారు మీసేవ టిఎఫ్ పోలియో ఆన్లైన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరి పేరు మీదైతే బంగారం సమర్పించాలనుకుంటున్నారో వారి బరువుకు అనుగుణంగా డబ్బులు చెల్లించి ఈ సేవలను బుక్ చేసుకుని వెసులుబాటును దేవాదాయ శాఖ కల్పించింది రాష్ట్రంలోని దాదాపు 5వేల మీసేవ సెంటర్లు దేశంలోని దాదాపు ఒకటిన్నర లక్షల పోస్టల్ కేంద్రాలు తెలంగాణలో 6000 కేంద్రాలు ఈ సేవలను అందించనున్నాయి బంగారం సమర్పణ తో పాటు అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ యాప్ మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు చెల్లించి పోస్టల్ డిపార్ట్మెంట్ కొరియర్ ద్వారా ప్రసాదాన్ని పొందే సౌకర్యాన్ని కూడా కల్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పోస్టల్ డిపార్ట్మెంట్ మీసేవ దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు


No comments:
Post a Comment