మహా పూజతో వేడుక షురూ 12న గిరిజన దర్బార్ కలెక్టర్ రాహుల్ రాజు వెల్లడి
ఆదివాసీల అతిపెద్ద పండుగ నాగోబా జాతర ఈనెల 9న ప్రారంభం కానిందని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు మంగళవారం కేసులాపూర్ లో నాగోబా ఆలయాన్ని ఎస్పీ గౌస్ ఆలం ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్తా తో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా దర్బార్ హాలులో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు నాగోబా జాతర ఈనెల తొమ్మిదిన మహా పూజలతో ప్రారంభమవుతుందని 12న దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు ఆలయం వద్ద భారికేట్లు పెట్టి పురుషులు మహిళలు వేరువేరుగా క్యూ లైన్ లలో వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు జాతరలో తాగునీటి సౌకర్యాలతో పాటు టాయిలెట్లు బాత్రూంంంంలో పెట్టాలన్నారు నాగోబా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని కోనేరును శుభ్రపరచాలన్నారు జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీసీ కెమెరాలు అమర్చాలని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ఖానాపూర్ ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనులు చేయాలన్నారు మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకుకున ఆర్టీసీ బస్సులు నడపాలని అన్నారు ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా మాట్లాడుతూ నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తాగునీరు పరిసరాల శుభ్రత మరుగుదొడ్లు, విద్యుత్తు ఇతర మౌలిక సదుపాయాల వంటి ఏర్పాట్లతో పాటు భక్తులు ప్రముఖులు అధికారులకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు ఎస్పీ గౌస్ వాళ్ళ మాట్లాడుతూ బందోబస్తు కోసం 600 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు

No comments:
Post a Comment