లింగంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఆదివారం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని వైశ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘంలో మార్గ శుద్ధ విదియ రోజుల వాసవి మాత దినోత్సవం ప్రతియటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు వేణు చిన్న దుర్గయ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
బీర్కుర్లో ఆర్యవైశ్యుల కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య భవనంలో కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం అమ్మవారి చరిత్ర పారాయణం చేసి తీర్థప్రసాదాలు అందించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు సంతోష్ వీరయ్య రమేష్ గోపి సంగమేశ్వర సంతోష్ తదితరులు పాల్గొన్నారు పిట్లం మండల కేంద్రంలోని వైశ్య సంఘ భవనంలో అమ్మవారికి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు బొడ్ల రాజు గ్రామ అధ్యక్షుడు గంగా ప్రవీణ్ మహిళా అధ్యక్షురాలు ప్రేమల సభ్యులు పాల్గొన్నారు



No comments:
Post a Comment