అది ఒక చిన్న శివాలయం కానీ దాని ముందు 20 అడుగుల ఎత్తు ఉన్న దీప స్తంభం ఉంది అది దేవాలయం ముందు అరుదుగా ఉండే సాధారణ దీప స్తంభం మాత్రమే కాదని పక్కనే ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాగిన నౌకాయానానికి ఉపయోగపడిన లైట్ హౌస్ కూడా అయ్యుంటుందనేదే ఆసక్తికి కారణం. 389 సంవత్సరాల క్రితం కృష్ణా నది తీరంలో ఈ స్తంభం ఏర్పాటు చేశారు ప్రస్తుత నల్లగొండ జిల్లా ముదిమాణిక్యంలో పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ తాజాగా దీని వివరాలు వెలుగులోకి తెచ్చింది శతాబ్దాల పాటు వాణిజ్యానికి కృష్ణా నది రవాణా సాధనంగా వినియోగించారు. నదీ తీరంలో అలనాటి జాడలను పలు ప్రాంతాల్లో పరిశోధకులు గుర్తించారు ఓడరేవుల జాడలను వెలుగులోకి తెచ్చారు చీకటి వేళ సాగే నవకలకు రేవుల జాడలు తెలిపేందుకు దీపపు స్తంభాలు ఉపయోగపడతాయి ముదిమాణిక్యం ప్రాంతం కూడా ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రంగా బాసిలిందన్న ఆధారాలున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు చిన్న దేవాలయం ముందు వెలుగు చూసిన దీపపు స్తంభం శతాబ్దాల క్రితం నౌకలకు లైట్ హౌస్గా కూడా ఉపయోగపడి ఉంటుందన్న అంశం కొత్త పరిశోధనలకు నూతమిస్తోంది అశోక్ కుమార్ తో కలిసి దీనిని వెలుగులోకి తెచ్చినట్టు ప్రిహా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎమ్మే శ్రీనివాసన్ పేర్కొన్నారు దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఉంటాయని కానీ దీప స్తంభాలు చాలా అరుదుగా కనిపిస్తాయి చాలా చిన్నగా ఉన్న శివాలయం ముందు 20 అడుగుల ఎత్తుతూ ఈ దీప స్తంభం ఉండటం మరింత ప్రత్యేకంగా ఉంది ఈ ఆలయం కృష్ణా నది ఒడ్డుపై ఉంది అది ఓడ రవాణా మార్గంగా కొనసాగినందున అది నౌకలకు దారి చూపే లైట్ హౌస్గా కూడా ఉపయోగించి ఉంటారు దానిపై తమిళ భాష పదాలు కలగాల్సిన తెలుగులో శాసనం చెక్కి ఉంది 1635 జూన్ 1 సోమవారం రోజు ఈ శాసనం వేయించినట్లు ఉంది కాశీ విశ్వనాథ మందిరానికి దీపస్తంభంగా దీనిని వాలి మునులయ్య కుమారుడు పోలినేడు ఏర్పాటు చేయించారని దానిపై శాసనాన్ని ఇడుపులపాటికి చెందిన మాదిరాజు నరసయ్య వేయించారని అందులో ఉంది అని ఆయన తెలిపారు

No comments:
Post a Comment