Friday 8 March 2024

11 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టం ఉన్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 11వ తేదీ ఉదయం  విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనం రక్షాబంధనం సాయంత్రం మృత్ సంగ్రహనం అంకురారోహణ

12న ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం సాయంత్రం బేరి పూజ దేవత ఆహ్వానం హవనం

13న అలంకార వాహన సేవలు ప్రారంభం ఉదయం మత్స్య అలంకారం వేద పారాయణం సాయంత్రం శేష వాహనం సేవ

 14న ఉదయం వటపత్రశాల అలంకార సేవ రాత్రి హంస వాహన సేవ

 15 నా ఉదయం శ్రీకృష్ణ మురళీకృష్ణుడు అలంకారం రాత్రి పున్నవాహన సేవ

 16న ఉదయం గోవర్ధనగిరిదారి అలంకారం రాత్రి సింహ వాహన సేవ

 17న ఉదయం జగన్మోహని అలంకారం రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం

 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి గజవాహన శ్రీ స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణం నిర్వహిస్తారు

 19న ఉదయం శ్రీ మహావిష్ణు అలంకార సేవ గరుడ వాహనం సేవలో శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి దివ్య విమాన రథోత్సవం 

20న ఉదయం మహా పూర్ణాహుతి చక్రతీర్థ స్నానం రాత్రి శ్రీ పుష్పయాగం దేవతో ద్వాసన దోపు ఉత్సవాలు

 21న ఉదయం అష్టోత్తర శతఘటభిషేకం రాత్రి శ్రీ స్వామివారి శృంగారౌలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి

బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు

 బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 నుంచి 21వ తేదీ వరకు శ్రీ సుదర్శన నరసింహ హోమం గజవాహన సేవ నిత్య కళ్యాణం బ్రహ్మోత్సవం జోడు సేవలను రద్దు చేయనున్నారు 17 18 19 తేదీలలో అర్చనలు భోగములు 20 21 తేదీలలో అభిషేకాలు అర్చనలు రద్దు చేయనున్నారు 18 వ తేదీన శ్రీ స్వామి అమ్మవారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3000 రూపాయల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తులలో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు



No comments:

Post a Comment