Sunday 17 March 2024

మన ఆలోచన

 అరణ్యవాసంలో ఉన్న పంచపాండవుల యొక్క క్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వారితో ఒక రాత్రి గడిపాడు పాండవులు వంతుల వారీగా గంటకొకరు చొప్పున తామున్న కుటీరాన్ని రాత్రి కాపలా కాయ సాగారు ఒకరు కాపలా కాసేటప్పుడు మిగిలిన వారు నిద్రిస్తున్నారు. అయితే వీరిలో ప్రతి ఒక్కరికి ఒక భూతం కనిపించింది అది క్రమంగా తన ఆకారాన్ని పెంచుకోవడం చూశారు దానిని హతమార్చడానికి ప్రయత్నించారు కానీ ఎవరు దాన్ని కనీసం అక్కడ నుంచి ధర్మా లేకపోయారు కాపలా కాస్తున్న ధర్మరాజుతో నన్ను కాపలా కాయని ఇవ్వరా బావ అన్నాడు కృష్ణుడు అంతట ధర్మరాజు ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది మీరే కదా మమ్మల్ని కాపాడేది మీరేగా అటువంటి మీరు కాపలా ఉంటానంటే వద్దని చెప్పడానికి మేమెవరము అన్నాడు పాండవుల వంతు ముగిసిన తర్వాత కృష్ణుడు తనవంతుగా కాపాడాకాశాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ భూతం ఉంది అది క్రమంగా పెద్దదవుతుంది అది మీకేమైనా తలనొప్పిగా మారుతుందేమో అని ఆందోళనగా ఉంది అన్నాడు. అంతటా కృష్ణుడు ధర్మ నీకు నామీద సందేహం రావచ్చా అది నీ బలహీనత నేను నా వంతుగా కాపలా కాస్తాను అన్నాడు అర్ధరాత్రి దాటింది ఓ గంట పాటు కృష్ణుడు కాపలా కాసిన తర్వాత అర్జునుడు వచ్చాడు బావా కృష్ణ నువ్వు ఆ పోతాన్ని లేకుండా చేసేశావే అన్నాడు అందుకు కృష్ణుడు అర్జున నేను ఏ భూతాన్ని పిశాచాన్ని నాశనం చేయలేదు. నా కంటికి అలా ఏదీ కనిపించలేదు ఏదైనా మనం చూసే తీరిలో ఉంటుంది మనలో ఏ ఆలోచనలో ఉంటే ఆ దృశ్యం మదిలో మెదులుతుంది అదే దర్శనమిస్తుంది అది ద్వేషమైన కావచ్చు కోపం అయినా కావచ్చు ఆనందమైనా కావచ్చు దేశం అనేది లేకుండా ప్రేమతో మనసును ని ంపితే మన ముందు ప్రేమే కనిపిస్తుంది. భూతం కనిపించదు అన్నాడు ఇది అర్థమైతే అందరూ ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. మన ఆలోచనలే మనకు కనిపించే భూతాలు

No comments:

Post a Comment