Wednesday 13 March 2024

దైవ సన్నిధి

 చీకట్లో ఆకాశం వైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తు వస్తుంది. ఎక్కడ నుంచి వచ్చాము మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది ఎప్పుడైతే ఈ జీవితం తాత్కాలిక మనం గ్రహిస్తాము అప్పుడు శాశ్వతమైన దానిమీద శ్రద్ధ పెడతాం ఆత్మకు మరణం ఉండదని ఆశ్చర్య పోవడం మొదలుపెడతాం. అప్పుడు మేల్కొంటాము

మనం ప్రేమించే వారితో గడిపే కాలం ఎంతో విలువైనదిగా గుర్తిస్తాము వారి కుటుంబ సభ్యులైన ఎవరైనా ప్రేమతో చూస్తాము ఈ కలిసి గడిపే క్షణాలు శాశ్వతం కాదని తెలుసుకుంటాము ప్రేమించే వారిపై విలువ ఎంతగానో పెరుగుతుంది మనకు జీవితంలో వారెంత ముఖ్యమో గుర్తిస్తాము ప్రతి ఒక్కరూ ప్రేమను ఆశిస్తారు పిలువని ఇవ్వాలని కోరుకుంటారు ప్రశంసించాలనుకుంటారు ఇది అహాన్ని పెంచడం కాదు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ వ్యక్తి కరణ దేవుడు అనంత కరుణామయుడు కరుణా సంపన్నుడు మనందరం మానసిక సాంత్వన శాంతి భౌతిక సంపద ఆధ్యాత్మిక సంపదలను కోరుతూ దేవుని ప్రార్థిస్తాను చిత్రమేమిటంటే మన హంభావాన్ని కోపతాపాలను ఈర్ష ద్వేషాలను భౌతిక వాంఛల పట్ల అనుబంధాలను తొలగించమని ఎప్పుడూ ఆయనను అడగను ప్రతి ఒక్కరికి దేవుడు దయ కోసం అభ్యర్థనలు పంపడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది ప్రతిరోజు తెల్లవారుజామునే ఒక పాప గుడికి వచ్చి దేవుడు ముందు నిలబడి కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ కొన్ని నిమిషాల పాటు ఏదో తనలో తాను కొనుక్కుంటుంది తర్వాత కళ్ళు తెరుస్తుంది వంగి నమస్కరించి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది ఇలా రోజు జరుగుతుండడం చూసిన పూజారికి ఆమె చేసే దానిపై ఆసక్తి పెరిగిపోయింది ఓరెంటి వారాలు గడిచాక పూజారి ఉండబట్ట లేక ఆ ఉదయం దేవాలయానికి ఆ పాప రాకముందే చేరుకుని ఆమె చేసేదంతా గమనించాడు తన చేతిని ఆమె తలపై ఉంచి పాపా నువ్వు రోజు రావడం చూస్తున్నాను. ఏం చేస్తున్నావు ముద్దుగా అడిగాడు నేను ప్రార్థిస్తున్నాను అంది కళ్ళు మూసుకుని చేస్తున్నావేమిటి? నాకు ఏ ప్రార్థన రాదు తెలుగు అక్షరాలు మాత్రమే వచ్చు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏదైనా అక్షరాలు లేకుండా ఉండదు కదా నేను చెప్పే అక్షరాలను తనకు నచ్చినట్లు మర్చిపోమంటున్నాను దేవుడిని అదైనా ప్రార్థన ఆ పాపది ఎంత స్వచ్ఛమైన మార్గం. దేవుని చేరుకోవడానికి ప్రార్థనలో హృదయం లేని మాటలకంటే మాటలే నీ హృదయం కలిగి ఉండడం మంచిది. హిందూ గ్రంథాలలో దేవిని మాతృ కర్ణ రూపినిగా కీర్తించారు ఆమె రూపం అక్షరాలతో రూపొందినది మనం మంచి మాటలు మాట్లాడిన నిర్మలమైన ప్రసంగాలు చేసిన ఆ దేవిని ఆరాధించినట్లే రాత్రివేళ ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాలు తీసుకువచ్చే ఆధ్యాత్మిక సందేశాలను మనం గ్రహించాలి ఇక్కడ ఎల్లకాలం ఉండమని మనకు అందుబాటులో ఉండే కాలాన్ని ఆనందంతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఇరుకతో జీవించాలి. మెరిసే నక్షత్రాల కన్నా అంతరంగంలోని కొలువుండే ఆ దైవాన్ని చూసుకోగలిగితే బతుకు ధన్యం

No comments:

Post a Comment