Monday 25 March 2024

శివ కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు

 27 నుంచి 31 వరకు జరగనున్న ఉత్సవాలు 28న కళ్యాణము

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న శివకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి 31 వరకు ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యాగశాలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుండగా వేములవాడ మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈనెల 28న అభిషేక లగ్న ముహూర్తాన ఉదయం 10:50 నుంచి 125 నిమిషముల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కల్యాణం సందర్భంగా రాజన్న ఆలయం మున్సిపాలిటీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముప్పయిన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలను వీక్షి ంచేందుకు లక్షలాదిమంది భక్తులతో పాటు జోగినిలు హాజరవుతారు ఒకవైపు శివుడి వివాహం జరుగుతుండగా జోగినులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం చెందుతారు ఐదు రోజులపాటు అభిషేకాలు పూజలు రద్దు శివ కళ్యాణం సందర్భంగా ఈనెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఆలయంలో నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేకం రద్దు చేయనున్నారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్ర హోమం టికెట్స్ భక్తులు సమర్పించే కోడెల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు



No comments:

Post a Comment