Tuesday 19 March 2024

ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

 ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

శుక్ర శని ఆదివారాల్లో అందించాలని నిర్ణయము మహా మండపం మొదటి అంతస్తులు ఏర్పాట్లు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందాల అధికారులు చర్యలు చేపట్టారు క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా ప్రసాద వితరణ హాల్లోకి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యము అమ్మవారి దర్శనానికి సుమారు 30 వేల నుంచి 40000 మంది విచ్చేస్తుంటారు వీరిలో అత్యధికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారే సాధారణ రోజులలో 4000 మందికి శుక్ర శని ఆదివారాలు రోజుకు 5000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు మహా మండపం రెండవ అంతస్తులు రెండు హాల్స్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది రాంబాబు అన్నదానం వితరణను పరిశీలించిన క్రమంలో పలువురు భక్తులు తమ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు మహా మండపం మొదటి అంతస్తులు పద్ధతిలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడంతో పాటు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకదాఫా 100 మంది చొప్పున రోజుల 1500 మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారమే దీని అమలు చేయాలని నిర్ణయించారు

No comments:

Post a Comment