Monday 18 March 2024

పెళ్ళికొడుకు అయిన నరసింహ స్వామి






 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆదివారం రాత్రి శ్రీ స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు ఉదయం ప్రధాన ఆలయ మాడవీధుల్లో శ్రీ స్వామి వారు జగన్మోహిని అలంకార సేవలు భక్తులకు దర్శనం ఇచ్చారు ఇక సాయంత్రం శ్రీ స్వామి వారు అశ్వ వాహనంపై పెండ్లి కొడుకుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయం మాడవీధులు ఊరేగించారు అనంతరం ఆచార్యులు అధికారులు స్వామివారి పక్షాన అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు శ్రీ నరసింహ స్వామికి లక్ష్మీదేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు

తిరు కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8:45 నిమిషాలకు గజవాహనంపై శ్రీ స్వామి ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయం మాడవీధుల్లో ఊరేగికి 915 నిమిషములకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఆ తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకను ఆచార్యులు వేద పండితులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రారంభిస్తారు తులా లగ్న ముహూర్తంలో రాత్రి  నిమిషములకు 9.37 నిమిషములకు శ్రీ స్వామి వారు అమ్మవారికి మాంగల్య ధారణ చేయనున్నారు ఇక ఉదయం శ్రీ స్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవ పై ఊరేగనున్నారు కళ్యాణానికి టీటీడీ పరిస్థితి వస్త్రాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాల ఉత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు ఉదయం టీటీడీకి చెందిన ఉపకార్య నిర్వహణ అధికారి లోకనాథం ఆదివారం మెల్ చాట్ పట్టు వస్త్రాలను తీసుకొని ఆలయమాల వీధిలో ఊరేగింపుగా వచ్చారు జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈవో భాస్కరరావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ప్రధాన అర్చకులకు అందజేశారు



యాదాద్రి స్వామికి వాహన సేవలు బహుకరణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో వినియోగించే వాహన సేవలు బంగారు మయంగా మారనున్నాయి హైదరాబాద్కు చెందిన ఒక దాత గజా గరుడ శేష వాహనాలను పంచలోహంతో తయారు చేయించి ఆదివారం యాదాద్రి ఆలయానికి తీసుకువచ్చారు తమిళనాడులోని మహాబలిపురంలో రవీంద్రన్ స్థపతి ఆధ్వర్యంలో వివాహనాలు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి వీటిని శిల్పులు యాదాద్రి కి తీసుకురావడంతో ఆలయ ప్రధాన అర్చకులు పరిశీలించారు ఆయన సూచనల మేరకు గజ గరుడ శేష వాహన సేవలను తిరిగి మహాబలిపురం తీసుకెళ్లి బంగారు తాపడం పనులు చేయనున్నట్లు తెలిసింది 20 రోజుల తర్వాత దాత ఆలయ అధికారులు ఆచార్యులకు అందజేయనున్నట్లు సమాచారం



No comments:

Post a Comment