Tuesday 5 March 2024

మార్గదర్శకత్వం అవసరము

 భగవతత్వం బోధపరచుకోవడానికి అడ్డదారి మార్గాలంటూ ఏమీ లేవని వ్యక్తులు లేనిది ఏది విశ్వంలో లేదు గనుక ఏ వ్యక్తికైనా అందుకు అంతర్దృష్టి ఒకటే సరియైన మార్గమని తత్వవేత్తలు చెబుతారు జ్ఞాన సమపార్జనకు అడ్డదారి ప్రయత్నాల వలన ఉపయోగము ఉండదు. సరి కదా ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. అదే కాకుండా తగిన ఫలితం లభించక నిరాశ మొదలై వ్యక్తిత్వాన్ని మరింతగా కృంగదీసేదిగా పరిణమిస్తుందని పెద్దల బోధనలు చెబుతాయి. పెద్దలను నిర్దేశించిన ఒక క్రమమైన పద్ధతిలో ప్రయత్నించి సాధన చేయడం వలననే వేదాంత విషయక జ్ఞాన సమపార్జన సాధ్యమవుతుందని మహాభారతం కూడా బోధించింది ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం చతుర్తాశ్వాసంలోని ఈ క్రింది పద్యంలో మనసుకు హత్తుకునే ఒక అర్థవంతమైన ఉదాహరణతో ఈ సంగతి విషయకరించబడింది చెట్టులో అగ్ని నిక్షిప్తమై ఉంటుంది అలాగని గుడ్డలతో నరికి చెట్టు లోపల అగ్నిని చూద్దామని ప్రయత్నిస్తే కనబడుతుందా కనబడదు కదా కానీ ఒక చెట్టుకు మరొక చెట్టు రాపిడి వలన అగ్నిపుట్టి అడవులను దహించి వేయడం తెలిసింది అలాగే ఆగమ కర్మలలో అగ్ని రాజయ్యడానికి ఎండిన రెండు చెట్టు కొమ్మల ముక్కలతో అరుణులు రాపిడి ద్వారా నిప్పును పుట్టించడం కూడా చూస్తూ ఉంటాం. ఇది దేనిని చెబుతుంది అంటే ఏ విషయాన్ని అయినా ఎలా గ్రహింపుకు తెచ్చుకోవాలో అలా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలం అవుతుంది కానీ అడ్డదిడ్డమైన పద్ధతులు అవలంబించడం వలన ప్రయోజనం ఉండదు అన్న సంగతిని చెబుతుంది శరీరాన్ని నిద్రాహాలకు నిద్రాహారాలకు దూరం చేసినందువలన పరమమైన జ్ఞానం లభిస్తుందని చేసే ప్రయత్నం ఆ కారణం చేతనే సరైనది కాదని పెద్దలు చెబుతారు గురువు మార్గదర్శకత్వంలో నిర్దేశిత పద్ధతులలో ప్రయత్నించడం వలననే అది సాధ్యపడుతుంది అని పై పద్యంలో భావము ఒక సందర్భంలో మనవుకు దేవ గురువైన బృహస్పతికి జరిగిన సంభాషణలో బృహస్పతి మానవునికి చెప్పిన మాటలు ఇవి

No comments:

Post a Comment