Friday 15 March 2024

పుష్పం ఫలం

 పూర్వం ఒక అమాయకుడు ఒక మామిడి తోట కొనుక్కున్నాడు దాని చుట్టూ బోలెడు మోదుగ చెట్లు అంటే అగ్నిపూల చెట్లు వీటినే పలాస చెట్లు అని కూడా అంటారు ఇవి ఉన్నాయి వసంతం రాగానే మామిడి చెట్లు పూత పట్టాయి కానీ అంత పెద్ద చెట్టుకు ఎంతో చిన్న పూలు కనిపించేసరికి అమాయకుడు నిరుత్సాహపడిపోయాడు పూలు చిన్నగా ఉంటే పండ్లు చిన్నవే కాస్తాయి కదా అని దిగులుపడ్డాడు అదే సమయంలో బళ్ళున పూసిన మోదుగ పూలు పెద్దగా ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించాయి పూలు ఇంత పెద్దగా ఉంటే కాయలు మరింత పెద్దవిగా రుచిగా ఉంటాయని అంచనా వేశాడు అమాయకుడు వెంటనే మామిడి చెట్లని నరికేసి మోదుగ చెట్లకు నీళ్లు పట్టి ఎరువు గట్ల వేసి పోషించాడు మోదుగ చెట్టు ఫలించినప్పుడు రుచి పచీలేని అతి చిన్న మోదుగ కాయలు చూసి అయ్యో నేను ఎంతటి మూర్ఖపు పని చేశాను అని అప్పుడు దుఃఖించాడు

నేను కూడా అలా మామిడి చెట్టును నరికి మోదుగ చెట్టును పోషించిన మూర్ఖుడినే.. సోహం ఆమ్రవనం చిత్వా పలాశాన్ చ న్య శేచయం.. రామం ఫలాగమే త్య క్త్వా.. పశ్చాత్ షోచామి దుర్మతి:. చేతికి అంది వచ్చిన రాముడిని దుర్మతినై వదులుకొని తర్వాత ఇలా శోకిస్తున్నాను ..వాల్మీకి అయోధ్య 63 -10.. రాముడు వనవాసానికి వెళ్లాక తన పట్టమహిషి కౌసల్య ముందు ఇలా వాపోతున్న వాడు దశరథ మహారాజు ఒక పని చేసేటప్పుడు దీని ఫలం ఎలా ఉంటుంది అది తీయని పుణ్యఫలమా లేక చేదు అయిన పాప ఫలమా ఈ  కర్మలో ఏమి దోషముంది ఎంతటి దోషం ఉంది అన్నది గమనిక అవసరం .అది నాకు లేకపోయింది అని పశ్చాత్తాప పడుతున్నాడు .చిన్నతనంలో ఆయన వేటకు వెళ్ళాడు. రాత్రి సరయు నదిలో నీళ్లు తాగేందుకు వచ్చి అడవి జంతువులను చీకటిలో వేటాడి చంపాలన్న చాపలయం వల్ల తొందరపాటుతో అంధకారంలో సంధించిన బాణం శ్రావణ కుమారుడి ప్రాణం తీసింది అలాగే మరో సందర్భంలో తనను ఎప్పుడైనా సరే ఏదైనా సరే వరంగ అడిగే అధికారాన్ని చిన్న భార్య కైకకు అనాలోచితంగా కట్టబెట్టాడు ఆ దూకుడు తనం వల్ల ఆయన చాలా చేదు ఫలాన్ని రుచి చూడవలసి వచ్చింది

No comments:

Post a Comment