31, జనవరి 2024, బుధవారం

పళనిలో అన్యమతస్తుల ప్రవేశం నిషిద్ధం

 తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పలని దండాయిదపాని ఆలయంలో హిందువులు మినహా అన్య మతస్తులు ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తరం జారీ చేసింది ఇటీవల ఆలయంలో అన్య మతస్తులు ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అనే ప్రకటన బోర్డును ఆలయ నిర్వహణ తొలగించారు దీన్ని వ్యతిరేకిస్తూ తలానికి చెందిన సెంథిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు హిందూ దేవాలయ ఆలయ ప్రవేశ చట్టం 1947 ప్రకారం హిందువుల ఆలయాల్లో అన్యమతస్తుల ప్రవేశానికి తావు లేదని బోర్డును తొలగించడం వల్ల ఇతర మతస్తులు ఆలయంలో ప్రవేశించవచ్చునని అపోహ ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వాదించారు ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది.



ఆలయానికి స్థలం విరాళం

 బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర మందిర నిర్మాణానికి పలువురు గ్రామస్తులు 120 గజాల స్థలాన్ని నిరాళంగా అందించినట్లు సర్పంచ్ బోనాల సుభాష్ తెలిపారు గ్రామానికి చెందిన కమల్ గారి పరివారానికి చెందిన లక్ష్మణ్ రంజిత్ రామ్ పటేల్ తమ సొంత స్థలాన్ని విరాళంగా అందించారని తెలిపారు.



30, జనవరి 2024, మంగళవారం

బాసర మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు

 మహారాష్ట్రలోని జాల్నా జంక్షన్ నుంచి బాసర మీదుగా అయోధ్యకు వచ్చే నెల నాలుగున ప్రత్యేక రైలు నెంబర్ 07.6 49 ను ఏర్పాటు చేశారు ఈ రైలు జాల్న ఫర్గూర్ శైలు పర్భని పూర్ణ నాందేడ్ ముదిఖేడ్ ఉమ్రి బాసర నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల లింగంపేట్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మీదుగా అయోధ్యకు చేరుకుంటుందని బాసర రైల్వే అధికారులు తెలిపారు నాలుగున ఉదయం 9:30 గంటలకు జాల్నా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:15 గంటలకు బాసర మీదుగా మరుసటి రోజు ఎక్కువ జామున 3 35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని అన్నారు అలాగే 7న అయోధ్య నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:53 గంటలకు బాసర మీదుగా జాల్న చేరుకుంటుందని తెలిపారు ఈ రైలులో 20 సాధారణ బోగీలు రెండు ప్రత్యేక భోగీలు ఏర్పాటు చేశారు


ఆలయ కమిటీకి విరాళం

 పాత బాన్సువాడ లోని ప్రసిద్ధి వినాయక మందిరంలో అర్చకుడి వేతనానికి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త నటరాజ్ సోమవారం 400 రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు సభ్యులు గంగారాం గోపాల్ తదితరులు ఉన్నారు.

శ్రీ వారి బంగారం తో మంగళ సూత్రాలు..

 తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకు అందే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది ఈ రకంగా తయారుచేసిన తాళిబొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభాపేక్ష లేని ధరను నిర్ణయించి విక్రయిస్తారు నాలుగైదు డిజైన్లలో తయారుచేసి ఈ మంగళ సూత్రాలు ఐదు గ్రాములు 10 గ్రాముల బరువుతో ఉంటాయి.





నర్సన్న హుండీ ఆదాయం 2.32 కోట్లు

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను సోమవారం ఆలయ అధికారులు లెక్కించార. 25 రోజులుగా హుండీలో భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండిని ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి తరలించి లెక్కించారు ఇందులో రెండు కోట్ల 32 లక్షల 22 వేల 689 నగదు రాగా 230 గ్రాముల బంగారం నాలుగు కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈవో రామకృష్ణారావు చెప్పారు అలాగే 593 యూఎస్ డాలర్లు 65 యూఏఈ గ్రహమ్స్ 65 ఆస్ట్రేలియన్ 220 కెనడా 10 సింగపూర్ డాలర్లు 10 ఇంగ్లాండు పౌండ్స్ 122 సౌదీ అరేబియా 400 ఒమన్ రియాల్స్ 15 యూరోస్తోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో చెప్పారు చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.


కొండ గట్టు అంజన్న ఆదాయం రెండింతలు

 కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలంపాట నిర్వహించగా నిర్వాహకులు పోటీపడ్డారు ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది గత ఏడాది వేలంపాట ద్వారా రూపాయలు రెండు కోట్ల 64 లక్షల ఆదాయం రాగా ఈసారి మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది టెండర్ను 45 లక్షలకు దక్కించుకోగా ఈసారి 80 లక్షలకు దక్కించుకున్నారు 94 లక్షలు గా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్ ఈసారి ఒక కోటి 37 లక్షలకు చేరింది వీటితోపాటు కిరాణా పూలు పండ్లు కూల్డ్రింక్స్ హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు వేలంపాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.


12, జనవరి 2024, శుక్రవారం

పేదవాడు ఎవరంటే

ఉన్నంతలో తృప్తిగా బతికే వారు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా రాజులైతే రాజ్య విస్తరణ చేసుకుంటూ పోయి  సామ్రాజ్యాధిపతులు కావాలని కోరుకుంటారు . ఈ క్రమంలో లక్షలాది మంది ప్రజలు,సైనికులు యుద్ధంలో మరణించడమో , ఇక్కట్ల పాలు కావడమో జరుగుతుంది.అటువంటి వారికి జ్ఞానోదయం కలిగించిన కథ ఇది.


విక్రమ వర్మ అనే ఒక రాజు ఎప్పుడూ ఏదో ఒక దేశం మీద దాడి చేయడం వారిని లొంగదీసుకోవడం పనిగా పెట్టుకున్నాడు. ఎప్పటి లాగే అతను పొరుగు దేశం మీదికి దండయాత్రకు బయలు దేరినప్పుడు మార్గ మధ్యలో ఉన్న ఒక అడవిలో ఒక మునిని చూడడం జరిగింది.ఎముకలు కొరికే చలిలో కేవలం నడుముకు పంచె మాత్రమే చుట్టుకుని ధ్యానం చేస్తున్నాడు. అయ్యో ఈ ముని చలినేలా తట్టుకుంటాడో అని తన దగ్గరున్న శాలువను కప్పాడు రాజు . దాంతో కళ్ళు తెరిచిన ముని ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు.

స్వామీ నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజును , పొరుగు దేశం పైకి దండయాత్రకు బయలు దేరాను. విజయం సాధించడానికి మీ దగ్గర ఆశీస్సుల కోసం మీ చెంత నిలుచున్నాను అన్నాడు రాజు. అంతట ముని.. సరే నాకు కప్పిన ఈ శాలువా తీసుకు పో, నేను ఇప్పటికే ధనవంతుడిని. నాకున్న ఆస్తి తో పాటు ఈ శాలువా భారాన్ని మోయడానికి సిద్ధంగా లేను అన్నాడు. 
అంతట రాజు.. స్వామీ మీరలా అనకండి , మీరు మునులు . మీకన్నీ తెలుసు. నా దగ్గర అనేక శాలువాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేను మీకిచ్చాను. ఇది స్వీకరించడానికి మీరెందుకు తిరస్కరిస్తున్నారు. మీరు అడగ లేదు. నా అంతట నేనే మీకు కప్పాను అన్నాడు రాజు. 
రాజు మాటలన్నీ విన్న ముని.. పుత్రా ఇప్పటికే నీ దగ్గర ఓ దేశం ఉంది. అది చాలదన్నట్లు మరొక దేశం మీదికి యుద్ధానికి పోతున్నావు. అలాగే నీ దగ్గర అనేక శాలువాలు ఉన్నప్పటికీ నీకు మరో శాలువ అవసరం ఉంది. అవసరాలు ఉన్నవాడే పేద వాడు నా దృష్టిలో. అతనికే అనేక వస్తువులు కావాల్సి ఉంటుందన్నాడు. 
ముని మాట రాజుకి చెంప దెబ్బలా అనిపించింది . దాంతో మనసు మార్చుకున్న రాజు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. 

పశుపతి

 



గొప్ప చెప్పుకొరాదు.

 



జగన్నాథ్ కారిడార్, పూరీ క్షేత్రం