అయ్యప్ప దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అయ్యప్ప దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

అయ్యప్ప స్వామికి స్వర్ణఖడ్గా బహూకరణ

 


నిజామాబాద్ పట్టణం అయ్యప్ప మందిరంలో సోమవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతులచే నిర్వహించిన చండీ హోమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి స్వర్ణఖడ్గం బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్ పాలు మాట్లాడుతూ ఈ పుణ్యకార్యంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు హరిహర సుతుని ఆశీర్వాదంతో హిందూ ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు ఈ మహాకార్యాన్ని తలపెట్టి విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణ కడగానికి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తన వంతుగా ఐదు లక్షల రూపాయలు స్వామివారి స్వర్ణ కడదానికి సమర్పించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేయర్ దండోయ్ తో కిరణ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ అసెంబ్లీ కన్వీనర్ లింగం భక్తవత్సలం ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు

నేడు స్వర్ణ ఖడ్గ బహుకరణ

 నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప మందిరంలో గల అయ్యప్ప స్వామికి సోమవారం జగన్ గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా స్వర్ణ ఖడ్గ బహుకరణ నిర్వహించనున్నట్లు ఇందూరు అయ్యప్ప మందిరం అధ్యక్షుడు గడ్డం భక్తవత్సలం తెలిపారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారని హిందువుల అయ్యప్ప మందిరం ప్రతినిధులు తెలిపారు మధ్యాహ్నం అన్న ప్రసాదన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

15, ఫిబ్రవరి 2024, గురువారం

నవీపేటలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

 నవీపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయం 11వ వార్షికోత్సవంతో పాటు వసంత పంచమి పండుగ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శశాంక్ జోషి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి గణపతి హోమం విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యులు బుడ్డ సంజీవరెడ్డి రామా గౌడ్ కిషన్ రావు కాంతం రెడ్డి బట్టల గంగాధర్ బిట్టు అరవింద్ రెడ్డి రాకేష్ తదితరులు పాల్గొన్నార



14, ఫిబ్రవరి 2024, బుధవారం

అయ్యప్ప ఆలయంలో అన్నదానం

 బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదానంలో భాగంగా సోమవారం గుడి నుంచి అన్నర్థులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగింది. సేవలో పాల్గొన్న రుద్రంగి ప్రకాష్ సెట్ కమిటీ మెంబర్ శేఖర్ గౌడ్ పడిగల రవికి ధన్యవాదాలు అయ్యప్ప ఆలయంలో జరిగే నిత్య అన్నదాన ప్రసాదం అందజేయడానికి భక్తులు ముందుకు రావలసిందిగా కోరుతున్నారు మీ పుట్టినరోజులు పెళ్లిరోజులు పిల్లల పుట్టినరోజులు మీ బంధువుల శుభకార్యాలకు అన్నార్తులకు అన్న ప్రసాదం అందజేయాల్సిందిగా కోరుతూ అయ్యప్ప కృపకు పార్తులు పాత్రులు కావాలని మనవి చేస్తున్నారు



అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

 నవీపేట మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించనున్నారు 11 సంవత్సరాల క్రితం వసంత పంచమి రోజున ఆలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు గణపతి హోమం అభిషేకం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అయ్యప్ప ఆశీస్సులు పొందాలని కోరారు

13, ఫిబ్రవరి 2024, మంగళవారం

నేడు అయ్యప్ప స్వామి ఆలయ ఎనిమిదో వార్షికోత్సవం

 ఎల్లారెడ్డి లోని అయ్యప్ప స్వామి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు వసంత పంచమి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు ఉదయం 5 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఆరు నుంచి ఏడున్నర గంటల వరకు మూలవిరాటుకు పంచామృతం తదితర అభిషేకాలు 8:30 నుండి 11 గంటల వరకు గణపతి హోమం పుణ్యాహవాచనం నవగ్రహ పూజ కళాశాపన దీపారాధన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు 11:30 గంటలకు దివ్య పదిని టాంపటికి ప్రత్యేక పూజ మధ్యాహ్నం ఒంటిగంటకు భక్తులకు అన్నదానం సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తికి పల్లకి సేవ ఉంటాయని పేర్కొన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు



హరి హర క్షేత్రంలో వైభవోపేతంగా ధ్వజారోహణం

 డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ హరి హర క్షేత్ర ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ వేద బ్రాహ్మణులు సోమవారం మంగళ వాయిద్యాలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవపీతంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రతిష్ట గణపతి హోమం సుప్రభాత సేవ నవగ్రహ హోమం అంటే కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు హరిహర క్షేత్రంలో ప్రత్యేక హోమంలో పాలుపంచుకున్నారు నేడు ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు