శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2026, ఆదివారం

గుహలో వెంకటేశ్వరుడు

 


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామ ఈశన్య దిశలో ఉన్న గుట్టల ప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశారు ఒకరోజు అకస్మాత్తుగా గుట్ట చీలిపోయి అందులో చిన్న గుహ ఏర్పడింది ఆ గుహలో నుంచి వినిపించిన ఘంటానాదం స్వయంగా వెలిగిన దీపజ్యోతి ఈ దృశ్యాలు గ్రామ ప్రజలలో భక్తి జ్యోతిని రగిలించాయి ఆ గుహలో వెలిసిన నిరాకార స్వరూపాన్ని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలవడం ప్రారంభించారు అప్పటినుంచి ఈ క్షేత్రం కొత్త దేవుడిగా ప్రసిద్ధి చెందింది ఏటా శ్రవణ మాసంలో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో పెద్దలతో కలిసి భక్తులు వనభోజనాలు చేస్తారు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ నిర్వహించే వనభోజనాలు ప్రత్యేక పూజలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి భక్తులు ముడుపులు కడుతూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు ఈ గుహకు తూర్పు దిశలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మికత పరిమళాన్ని జోడిస్తోంది గుహ సమీపంలో విరాజిల్లే భారీ మర్రిచెట్టు దాని నీడలో కూర్చుని జపమాలలు తిప్పే భక్తులు గాలిలో తేలే మంత్రం ఈ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక జీవంత ఆధ్యాత్మిక ప్రపంచంగా నిలబెడుతున్నాయి. ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నప్పటికీ ఈ క్షేత్రం ఇప్పటికీ నిరాదరణలోనే ఉంది ఆలయ నిర్మాణం లేకపోవడం రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉండడం తాగునీరు విద్యుత్ వంటి కనీస వసతులు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఒక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ నిర్మాణం రహదారులు తాగునీరు విద్యుత్తు విశ్రాంతి గృహాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. 




25, మార్చి 2024, సోమవారం

శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

15, మార్చి 2024, శుక్రవారం

జెండా బాలాజీ ఆలయ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార



7, మార్చి 2024, గురువారం

స్వర్ణగిరి వెంకటేశుడికి ప్రాణ ప్రతిష్ట

 



స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు బుధవారం భువనగిరి శివారులోని మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు హోమాధికతువులతో స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు



3, మార్చి 2024, ఆదివారం

తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు

 డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు

1, మార్చి 2024, శుక్రవారం

అపురూప ఆలయంలో భారతి నృత్యానికేతన్ చిన్నారుల నృత్య ప్రదర్శన

 


అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్దగల భారతి నృత్యానికేతన్ విద్యార్థులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన చేయించినట్లు నాట్య గురువు సరోజ సుధీర్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమ్మల్ని ఆహ్వానించిన దేవస్థానం కమిటీ వారికి విజయ విద్యాసంస్థల అధినేత్రి అమృతరతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



మానేపల్లి హిల్స్ పై స్వరనగిరి

 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్ పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారధ్యంలో నిర్మించిన స్వర్ణ గిరి పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ట ఆలయ ఉత్సవాల కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు ఆయన కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ తెలిపారు నుంచి ఆరు వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈనెల 6న వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 116కు జరిపించి అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సంపన్నం కానున్నట్లు తెలిపారు భువనగిరి పట్టణానికి పూత వేటి దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్మకలనం చేసి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరు సహాయ సహకారాలు కావాలని కోరారు నూతన ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు బుధవారం ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మానేపల్లి హిల్స్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణ గిరి అని నామకరణం చేసిన కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తిన్నచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సుభిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు నిర్మించినట్లు తెలిపారు. దేవాలయావరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానం అవుతాయని తెలిపారు ఈ సమావేశంలో ఆలయ రూపశిల్పి ప్రముఖ సపతి డిఎన్వి ప్రసాద్ వేద పండితులు కుటుంబ సభ్యులు ఉన్నారు

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన

 తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన

టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార

శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు

శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి

చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు


తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

22 ఎకరాల్లో స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం

 భువనగిరిలో నిర్మించిన మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ 6న చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట

మానేపల్లి కుటుంబం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్లో నిర్మితమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు అంతా సిద్ధం చేస్తున్నారు తమ సొంత స్థలమైన 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టామని మార్చి ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు మహా కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత మానేపల్లి రామారావు తెలిపారువ తేదీ ఉదయం 116 నిమిషాలకు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని గురువారం హైదరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆరోజు నుంచే భక్తుల దర్శనాలు మొదలవుతాయి అన్నారు స్థపతి డిఎన్ఏ ప్రసాద్ మాట్లాడుతూ లేదా విమాన గోపురం తో కూడిన గర్భాలయం 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం సిద్ధమైనట్లు వివరించార

4 అడుగుల ఎత్తైన రథంతో పాటు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం శ్రీ లక్ష్మీనరసింహస్వామి భూవరాహస్వామి వకుల మాత ఉపాలయాలను నిర్మితమైనద తెలిపారు.