POETRY / కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
POETRY / కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

రాజాం రచయితల వేదిక 110వ సమావేశం

 ఈనెల మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక ఒక వంద పది వ సమావేశం జరుగుతుంది రాజాకు శాంతారావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వేమన ప్రగతి శీలత అనే అంశంపై బొంతు సూర్యనారాయణ ప్రవాహి ముఖ్య ప్రసంగం చేస్తారు

గారా రంగనాథం 9885758123

22, మార్చి 2024, శుక్రవారం

కవిత్వం బడుగు జీవుల జీవనానికి అద్దం పట్టాలి

 కవిత్వం బడుగు జీవుల సమకాలీన జీవనానికి అద్దం పట్టాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్ శిక్ష కన్నారు. ప్రపంచ కవిత్వా దినోత్సవం సందర్భంగా గురువారం తెరవే ఆధ్వర్యంలో కవి సమ్మేళన నిర్వహించారు ప్రతి ఏడాది మార్చి 21న నిర్వహిస్తున్న ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని కవులకు ఇచ్చే గౌరవంగా భావించాలన్నారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య మాట్లాడుతూ తమ సమాజ వాగు కోసం కవులు రచయితలు రచనలు చేయాలని కవులకు దిశా నిర్దేశం చేశారు పలువురు కవులు కవిత గానం చేశారు తెరవే ప్రతినిధులు అల్లి మోహన్ రాజ్ మండపేట కాసర్ల రామచంద్రం లకులాభరణం సుధాకర్సు రేష్ తదితరులు పాల్గొన్నారు



21, మార్చి 2024, గురువారం

కరపత్రాలు ఆవిష్కరణ

 కవిత్వ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాశాల ఆవరణలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కవిత్వ లక్షణాలు ప్రయోజనాలు తెలియజేసే కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవి నిజాయితీగా ఉండి ప్రజల బాధలకు తన రచనల ద్వారా పరిష్కార మార్గం చూపాలని కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని కవితాను మేల్కొంటూ ఇతరులను మేల్కొల్పుతాడని అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రతినిధులు మందపితాంబ పెనిశెట్టి గంగా ప్రసాద్ కార్యదర్శి మోహన్ రాజ్ నాగభూషణం కాసర్ల రామచంద్రం వకులాభరణం సుధాకర్ చంద్రకాంత్ పాల్గొన్నారు



11, మార్చి 2019, సోమవారం

గ్రంధాలయం - కవిత

గ్రంధాలయం  - ఒక అద్భుతమైన ప్రపంచం
జ్ఞాన పరిమళాలను వెదజల్లే ఒక సుగంధ ప్రపంచం
దుర్వ్యసనాలను దూరం చేసే ఒక ఔషధ ప్రపంచం
విశాల దృక్పథాన్ని పెంచే ఒక విజ్ఞాన ప్రపంచం
షడ్రసోపేత అక్షరాల భోజనాన్ని వడ్డించే ఒక బంగారు కంచం
నిశిరాత్రి వేళ కమ్మటి నిద్రపట్టేలా చేసే ఒక చక్కటి నులక మంచం
మన మనో ప్రపంచాన్ని మధుర అనుభూతులతో నింపే ఒక మరో ప్రపంచం
తప్పకుండా మీరు కెటాయిస్తే గ్రంధాలయానికి రోజూ సమయం కొంచెం
గణుతికెక్కిస్తుంది మిమ్మల్ని తప్పకుండా అబ్బురంగా చూసేలా ఈ సమస్త ప్రపంచం.

9, నవంబర్ 2018, శుక్రవారం

ఇవేం టివి సీరియళ్ళయ్యా బాబు - కవిత

ఇవేం టివి సీరియళ్ళయ్యా బాబు
నింపుతున్నాయి నిర్మాతల జేబు,
ప్రదర్శిస్తున్నాయి సీరియల్ అంతా డాబు ,
 నిండి ఉంటున్నాయి పాత్రలన్నీ యెంతో రుబాబు,
ఆలోచిస్తున్నాయి పాత్రలన్నీ ఏమిటని ఈ మతలబు,
చేస్తున్నాయి మనుషుల మనసంతా ఖరాబు,
మారుస్తున్నాయి మనసుని దీపావళి మతాబు,
అవుతున్నాయి మనసులు సదాలోచనల లేమితో గరీబు,
చెడగొడుతున్నాయి దురాలోచనలతో యెందరిదో నసీబు ,
ఎప్పుడిస్తాయో ఈ దుష్ట సీరియళ్ళనుండి విముక్తి అనే ప్రశ్నకు జవాబు
విడిపోతాయి తప్పకుండా దుష్ట సీరియళ్ళ సంకెళ్ళు ,దృష్టిపెడితేనే  తప్పకుండా నవాబు.

9, అక్టోబర్ 2018, మంగళవారం

నేనొక కవిని - కవిత

నేనొక కవిని
నిరంతరం జ్వలించే రవిని
సృజనాత్మకతకై తపించే జీవిని
రుచికర లేత చిగురుమావిని
సదా ఆలోచనల ఊట ఊరే ఊటబావిని
రణగొణ ధ్వనుల ప్రపంచంలో వినూత్న శబ్దాలకై రిక్కించి వినే చెవిని
కవిత్వమనే మహా సముద్రంలో చిన్న నీటి బిందువుని
కవిత్వమనే విశాల ఎడారిలో చిరు ఇసుక రేణువుని
విశాల వృక్ష సామ్రాజ్యంలో ఔషధ వృక్షం రావిని
కవిత్వ ప్రపంచంలో బుడి బుడి నడకలు వేస్తున్న బుజ్జాయిని
సకల దేవతలు వసించే దివిని
సకల ప్రాణికోటి వసించే భువిని
నేనొక కవిని


30, సెప్టెంబర్ 2018, ఆదివారం

నడి రోడ్డుపై - కవిత

నడి రోడ్డుపై నాటు ఆయుధాలతో చెట్లను నరికినట్లు మనుషులను నరుకుతుంటే ఆపాల్సింది పోయి
అదేదో నయనానందకరమైన షో జరుగుతున్నట్లు నయా నయా ఫోనులతో నానా రకాలుగా వీడియోలు తీయడం ఏం సోయి
పరిస్థితులు ఏ క్షణమైనా తారుమారు అవుతాయనే ఇంగిత జ్ఞానం పోయి
మనుషులు తీస్తున్నారు వీడియోలు ,షేర్ చేస్తున్నారు వీడియోలు మతి చెడిపోయి
కఠినమైన చట్టాలు చేస్తేనే,కఠిన చర్యలు చేపడితేనే పూర్వపు చైతన్యం వస్తుంది ఈ దారుణమైన రోగం పోయి

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు - కవిత

ఓటు - వెల్లడించును ప్రజల మనసులోని తిరుగుబాటు
ఓటు - నేతల బరువును తూచే తూకపు బాటు
ఓటు - నాయకులకు తెప్పించును తీవ్ర తలపోటు
ఆదమరిచి వ్యవహరిస్తే వేయును వేటు
ఓటు - పౌరుల చేతిలోని క్రికెట్ బ్యాటు
బాగా ఆడితే తెరువును సిక్సర్లకు బార్లా గేటు
కల్పించును విజేతల జాబితాలో చోటు
ఓటు - గుంటూరు మిర్చికంటే ఘాటు
సరిగా వాడితే అది అందించే రుచి ఎంతో గ్రేటు
ఓటు - ఎంతో మందిని చేయిస్తుంది సర్కస్ ఫీటు
ఒకే ఓటు మార్చివేయును ఎంతో మంది ఫేటు
ప్రతి పౌరుడు విధిగా తెలుసుకోవాలి ఎంతో విలువైనదని తన ఓటు
అలా తెలుసుకుని మెదులుకుంటేనే నిజంగా మీరు గ్రేటు.
ఓటు - మనందరికీ కల్పిస్తుంది అద్భుతమైన వెసులుబాటు
ఈ విషయమై ప్రతి ఒక్కరూ అలోచించాలి కొద్ది సమయం పాటు
అప్పుడే ఉండవచ్చు నిశ్చింతగా ఐదు సంవత్సరాల పాటు

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు - కవిత

అడుగడుగునా పొంచి ఉంది ప్రమాదం అతివలకు నేడు
ఇంట్లో నుండే సాగించాల్సివస్తోంది పోరాటం ఇంతులకు నేడు
అబలలు కాకూడదు బేలలు ఏనాడు,కావాలి అతిబలవంతులు నేడు
ఖాళీ చేతులతోనే కామాంధుల కావరమణచగలగాలి కాంతలు నేడు
అందుకు ఆత్మ రక్షణ విద్యలు నేర్వాలి అత్యవసరంగా అతివలు నేడు
మానాభిమానాలు కాపాడుకోవాలి మార్షల్ ఆర్ట్స్ తో మహిళలు నేడు
భద్రత భరోసా పొందాలి బ్లాక్ బెల్ట్ లాంటి విద్యలతో బాలికలు నేడు
ఒడుపుగా ఒక్క గుద్దుతోనే ఓటమిని జయించగలగాలి ఒంటరి మహిళలు నేడు
కరుణ ,జాలితో పాటు కాఠిన్యం కూడా నేర్వాలి కన్నె పిల్లలు నేడు
అల్లరి వెధవలకు బుద్ధి చెప్పాలి కాళ్ళూ చేతులే ఆయుధాలుగా చేసి అమ్మాయిలు నేడు
బాక్సింగ్ ,కరాటే లాంటి విద్యలు నేర్వాలి పాఠశాల బాలికలు,సాఫ్ట్ వేర్ ఉద్యోగినులు నేడు
తైక్వాండో లాంటి తన్నుడు విద్యలు తప్పకుండా నేర్వాలి తరుణిలు నేడు
గుర్తెరగాలి పార్వతి లేనిదే శివుడికి ఏనాడు శక్తి లేదని నేడు
స్మరించుకొని సదా సత్యభామను ,ఎదుర్కోవాలి సమస్యను సమర్థంగా నేడు


14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా - కవిత

కాలం చెల్లినది ఏదైనా ,వాహనమైనా,రహదారైనా
గుర్తించాలి మనకు నూకలు చెల్లిస్తుందని ఏనాటికైనా
తక్షణమే కళ్ళు తెరవాలి మనం ఇకనైనా
కాలం చెల్లిన వాటికి నూకలు చెల్లించాలి కాస్త కష్టమైనా
రెండో మాటకు తావివ్వొద్దు కలలోనైనా
లేకపొతే సమవర్తి చూపడు పక్షపాతం ,కనికరం లేశమైనా
నిర్దాక్ష్యంగా తీసేస్తాడు మన ప్రాణాలు  యే చోటనైనా, ఆలస్యం చేయకుండా నిమిషమైనా
నాణ్యత లేని వాహనాలు,రోడ్లపట్ల చర్యలు తీస్కోవాలి పట్టుదలగా ఆరునూరైనా
లేకపోతే మన ప్రాణాలు కలుస్తాయి గాలిలో యే క్షణమైనా
మన ఉదాసీన వైఖరి దారి తీయును ప్రమాదానికి యే రోజుకైనా
అసలు నూకలు చెల్లించాల్సింది దీనికేనని గుర్తించాలి ఎవరైనా
నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉండాలి జీవిత నిపుణత సాధించుటకై వీసమెత్తైనా
అపుడే నిజమైన అభివృద్ధి కలుగుతుంది నిదానంగానైనా



7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పవిత్ర ప్రదేశమైనా,పని చేసే ప్రదేశమైనా,పడక గదియైనా - కవిత

పవిత్ర ప్రదేశమైనా,పని చేసే ప్రదేశమైనా,పడక గదియైనా
పల్లెటూరైనా,పట్టణమైనా ,పరాయి దేశమైనా,ప్రాంతమేదైనా
ప్రయాణించే బస్ ఐనా,రైలూ ఐనా,విమానమైనా
కాదేదీ అనర్హం అన్నట్టు ,పల్లె పడుచు నుండి ,పట్టణపు పడతి వరకు
పసిపాప నుండి పండుటాకు వరకు పడతి పడుతోంది పలు కష్టాలు
పాపుల పాలబడి పలు ఏండ్ల నుండి పన్ను బిగబట్టి
పట్టువదలకుండా పలుమార్లు పళ్లూడిపోయేలా దాడులు చేస్తేనే
పాపుల పాపం పండుతుంది,పరిష్కారం లభించి ఫలితం కనబడుతుంది
స్త్రీ గౌరవింపబడిన చోటనే దేవతలు నివాసముంటారు అనే శాస్త్ర వాక్యం
అందరూ సదా గుర్తుంచుకోవాల్సిన ఆప్తవాక్యం
ఆడపిల్లలు అదురు బెదురు లేని బెబ్బులులై గర్జించాలి
అతివలు ఆత్మవిశ్వాసం,అధ్యాత్మిక విశ్వాసాలతో
అణచివేయాలి అక్రమార్కుల ఆగడాలు
కన్నెలు కన్నెర్ర చేసి కండకావరం పట్టిన కనికరం లేని మనుషులను
చేయాలి కనబడకుండా ,కనుచూపుమేరలో లేకుండా
అతివలు ఆత్మరక్షణ విద్యలు నేర్చి అతిక్రమించాలి అవమానాలు
పడుచులు పట్టుదలతో పోరాడి వెలుగొందాలి పట్టపురాణులై
ధైర్యే సాహసే లక్ష్మీ , ధైర్యే సాహసే రక్ష రక్ష...

31, ఆగస్టు 2018, శుక్రవారం

చెప్పుడు మాటలు చేటు ...- కవిత

చెప్పుడు మాటలు చేటు ...
మనసులో విషబీజాలు నాటు...
వింటే తప్పదు మనకు అగచాటు...
భజనపరుల మాటలు భంగపాటుకు చోటు...
కలిగించును మనకు వెన్నుపోటు...
సదా అప్రమత్తతకు కల్పించు చోటు ...
తప్పించును మనకు గ్రహపాటు ...
నిజాయితీకి వేయు పెద్ద సీటు...
అది నిన్ను కాపాడును పది కాలాల పాటు...

నాణ్యత...ఒక చిన్న పదం,పాటిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం - కవిత

నాణ్యత...ఒక చిన్న పదం,పాటిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
హెల్మెట్ ... ఒక చిన్న పదం, ధరిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
అణువు...  ఒక చిన్నపదం,అనువుగా వడుకుంటే ప్రమోదం లేకుంటే సృష్టించును పెను ప్రమాదం...
బతుకు...ఒక చిన్న పదం,సక్రమంగా సాగిస్తే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
బలం ...ఒక చిన్న పదం,కల్గించును ప్రమాదం లో ప్రమోదం,ప్రమోదం లో ప్రమాదం...
ప్రాణం...ఒక చిన్న పదం,తనువులో ఉంటే ప్రమోదం లేకుంటే ప్రమాదం...
విలువ...ఒక చిన్న పదం ,పెంచుకుంటే ప్రమోదం,తగ్గించుకుంటే ప్రమాదం...
శిక్షణ...ఒక చిన్న పదం, పొందితే తప్పించును పెను ప్రమాదం,కలిగించును ప్రమోదం...
వైఖరి...ఒక చిన్న పదం...సానుకూలమైతే ప్రమోదం,ప్రతికూలమైతే ప్రమాదం...

'అతి సర్వత్ర వర్జయేత్... - కవిత

'అతి సర్వత్ర వర్జయేత్...
అత్యాశ ఎల్లవేళలా కలిగించును నిరాశ...
అతి నష్టం కలిగించును మనసుకు ఎంతో కష్టం...
అతి లాభం కలిగించును ఎంతో గాభరా...
అతి వాగుడు  ఆడిస్తుంది ఎంతటివారినైనా చెడుగుడు...
అతి వినయం కలిగించును వినాశనం...
అతి ప్రేమ కలిగించును తప్పకుండా చెడుపు...
అతి వృష్టి చెల్లా చెదురు చేయును ఈ సృష్టిని...
అతి ఒత్తిడి చేయును జీవితాన్ని చిత్తడి చిత్తడి...
అతి క్రమశిక్షణ చేయును తనువు మనువుల భక్షణ...
అతివ్యామోహం కల్గించును తప్పకుండా అవమానం...

గల గలా పారే గంగమ్మ తల్లి.. - కవిత

గల గలా పారే గంగమ్మ తల్లి...
కురిపించు మా పై విరివిగా వరాల జల్లు ...
కళకళలాడించు మా పైరులను పచ్చదనంతో..
తరిమికొట్టు కరువు అనే రాక్షస బల్లి...
విరబూయించు మా మోములపై చిరునవ్వుల జాజిమల్లి...
భోళా శంకరుడి తలపై ధవళ వర్ణంతో నిర్మలంగా ఒదిగిన ఓ తల్లీ
ప్రణమిల్లుతాము నీ ముందు ముకుళిత హస్తాలతో మోకరిల్లి ...
సదా ప్రసరించు నీ చల్లని చూపు పండు వెన్నెల జాబిల్లి...
అమ్మా గంగమ్మ తల్లి...

30, ఆగస్టు 2018, గురువారం

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో - కవిత

నిరంతర విద్యుత్ లభించిందని ఆనందించాలో
అజాగ్రత్త,నిర్లక్ష్యం తో విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోతున్నయని బాధపడాలో
అర్థం కావడం లేదు
విద్యుత్ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,వ్యవసాయ శాఖ ప్రచార తీవ్రత పెరగాలో,స్వీయ అవగాహన పెరగాలో
అర్థం కావడం లేదు
కాలం కలిసి రాక ,పంట నష్టపోయి కొందరు చనిపోతుంటే
అన్నీ బాగుండి ,చిరు జాగ్రత్తలు తీసుకోకుండా ,విద్యుత్ షాక్ తో చనిపోవడం ఏమిటో
అర్థం కావడం లేదు
వార్తా పత్రికలు చదువుతూ,ఇతరుల అనుభవాల నుండి గుణపాఠం ఎపుడు నేర్చుకుంటామో
అర్థం కావడం లేదు
ఇంకెంత కాలం ఈ ఏమరుపాటు చర్యలు కొనసాగి విలువైన ప్రాణాలు కోల్పోతాయో
అర్థం కావడం లేదు
కాంక్రీట్ పని చేసే కార్మికులు సైతం కాళ్ళకు,చేతులకు రక్షణ తొడుగులు ధరించి పనులు చేస్తున్న ఈ కాలంలో
నీరు నిప్పు విద్యుత్ లతో చెలగాటం ప్రమాదకరమని తెలిసీ
కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా కరెంట్ షాక్ కు బలైపోవడం ఏంటో
అర్థం కావడం లేదు
నీ పని నువ్వు చెయ్ ,ఫలితం నాకొదిలెయ్ అన్న శ్రీకృష్ణుడి కర్మ సిద్ధాంతాన్ని
సక్రమంగా ఎపుడు పాటిస్తామో అర్థం కావడం లేదు
ఇకనైనా చైతన్యం తెచ్చుకొని చిరు,తగు జాగ్రత్తలు తీసుకుని ,ప్రాణాల విలువ తెలుసుకొని కాపాడుకుంటారో లేదో
అర్థం కావడం లేదు
ఆ భగవంతుడి దయ ఎపుడు కలుగుతుందో
ఈ దుస్సంఘటనలు ఎపుడు ఆగిపోతాయో
అర్థం కావడం లేదు

తలకు తప్పకుండా ధరించండి హెల్మెట్/శిరస్త్రాణం... - కవిత

తలకు తప్పకుండా ధరించండి హెల్మెట్/శిరస్త్రాణం...
లేకుంటే వినాల్సివస్తుంది మృత్యుగానం...
అవుతుంది నెత్తుటితో స్నానం...
రహదారులు ,వాహనాలకు వుండదు ప్రాణం...
అవి తప్పించలేవు జరిగే దారుణం...
అత్యంత విలువైనది మీ ప్రాణం...
మీ కుటుంబసభ్యులకు మీరంటే ఎంతో ప్రాణం...
చేయాలి మీరు జీవితంలో ఎంతో ప్రయాణం...
అందుకై నేడే చేయండి ప్రమాణం...
ధరిస్తామని తలకు శిరస్త్రాణం...

ఆత్మహత్యలు వద్దు...- కవిత

ఆత్మహత్యలు వద్దు...
జీవితమెంతో ముద్దు...
కృషితో నాస్తి దుర్భిక్షం అనడం కద్దు...
పల్లె ఐనా పట్టణమైనా పరాయి దేశమైనా పనిచేసుకునేవారికి ఆకాశమే హద్దు...
మహనీయుల మాటలు మరువ వద్దు...
సత్సాంగత్యం సద్గ్రంధ పఠనం కలిగించును లాభాల పద్దు...
సమీపానే ఉంది విజయపు సరిహద్దు...
పదే పదే ప్రయత్నించడం మానవద్దు...
తప్పకుండా ఉదయిస్తుంది తొలి పొద్దు...
ఆత్మహత్యా ఆలోచనలు అసలే వద్దు...
గమనించు కర్షక కార్మిక తాడిత పీడిత మిత్రమా ...
ఆత్మహత్యలు వద్దు...

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...- కవిత

చిరుజల్లులే జడివానగా మారి కురిపించును భారీ వర్షం...
చిన్నవాడైనా అగును పెద్ద మనసున్నవాడుగా...
చిట్టెలుకయే ఆపదలో కాపాడెను మృగరాజును...
చిగురుటాకులే మార్చును చిన్న మొక్కను మహా వృక్షంగా...
చిరు గింజయే పుట్టించును మధుర ఫలాలనిచ్చే వృక్షాన్ని...
చిరు అడుగులే చేర్చును ఎంత పెద్ద గమ్యమైనా...
చిల్లర పోగేస్తే మారుతుంది ఆపదలో ఆదుకునే నేస్తంగా...
చిరుగాలి కలిగించును మనసుకు ఎంతో హాయి...
చిరు ఉడుతయే నిలిచెను సహాయానికి మారు పేరుగా...
చిరు అణువుయే సృష్టించును మహా ప్రళయం...
చిరు వామనుడే ఆక్రమించెను ముల్లోకాలను చిరు అడుగులతో...
చిరు రంధ్రమే ముంచి వేయును పెద్ద ఓడను మహా సముద్రంలో...
చిరు తిండియే పాడు చేయును విలువైన ఆరోగ్యాన్ని...
చిరు వైరసే కబళించివేయును విలువైన ప్రాణాలను...
చిరు అంటేనే జ్ఞప్తికి వచ్చును పవర్ ఫుల్ " మెగా స్టార్ "...
చిరు స్టెప్పులేస్తే తన్మయత్వంతో ఊగిపోవును సినీ అభిమానులు ...
చిరు చీమ యే నిలిచెను శ్రమకు స్ఫూర్తిగా
చిరు అపార్థమే కలిగించును సంబంధబాంధవ్యాల విచ్చిన్నం
చిరు గడ్డి పోచలే ఐక్యమై బంధించును గజరాజును సైతం...
చిరు మెజారిటీ ఐనా నిలుపును విజేతగా ఎంత పెద్ద పందెంలోనైనా...
చిరు ధాన్యాలు కలిగియుండెను ఎన్నో పోషకవిలువలు...
చిరు బాలల హృదయాలే వెలుగొందెను నిష్కల్మష దైవ మందిరాలుగా
చిరు బాల వాక్కుయే వర్ధిల్లెను బ్రహ్మ వాక్కుగా...
చిరు ప్రాయ జ్ఞాపకాలే కలిగించును ఎంతో ఆనందం...
చిరు శిశువులే నిరూపించెను సతీ అనసూయా దేవి మహిమను...
చిరు బాలలతో ఆటలాడెను సద్గురు శ్రీ సాయినాథులు...
చిరు నలుసే కలిగించును కంటికి ఎంతో బాధ...
చిరు ప్రహ్లాదుడే నిరూపించెను హరి నామ మహిమను...
చిరు కృష్ణుడే చూపెను ఎన్నో మాయా లీలలు...
చిరు చక్కిలిగిలే కదిలించివేయును ఎంతటి భారీ శరీరాన్నైనా...
చిరు శబ్దమే కాపాడెను ధర్మరాజు సత్య సంధతను...
చిరు బాలల పలుకులే కలిగించును మనసుకెంతో మురిపెం...
చిరు పల్లెలే అయ్యెను దేశానికి పట్టుగొమ్మలు...
చిరు తప్పిదము దారితీయును పెను ప్రమాదానికి...
చిరు దీపమే తరిమికొట్టును కారు చీకట్లను
చిరు ఏదైనా కలిగించును నష్టమైనా లాభమైనా భారీగా...
" చిరు అంశం " పట్ల ఎప్పుడూ " చిన్న చూపు " వలదు సుమా...

ఈత...నేర్చితే మార్చును మన తల రాత...- కవిత

ఈత...నేర్చితే మార్చును మన తల రాత...
లేకపోతే మిగిల్చును తల్లిదండ్రులకు గుండె కోత...
నేర్పాలి అందరికి ఈత...
అందించాలి అందరికి వరదల్లో చేయూత...
ప్రాణరక్షణ విద్యల్లో నైపుణ్యత..
పొడిగించును మన జీవితపు పొదుపు ఖాతా...
జన్మనిస్తుంది మాత...పునర్జన్మనిస్తుంది ఈత...
ఈత..చక్కని ఆరోగ్యానికి మేత...