శ్రీ రాజ రాజేశ్వర ఆలయాలు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ రాజ రాజేశ్వర ఆలయాలు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

శివ కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు

 27 నుంచి 31 వరకు జరగనున్న ఉత్సవాలు 28న కళ్యాణము

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న శివకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి 31 వరకు ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యాగశాలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుండగా వేములవాడ మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈనెల 28న అభిషేక లగ్న ముహూర్తాన ఉదయం 10:50 నుంచి 125 నిమిషముల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కల్యాణం సందర్భంగా రాజన్న ఆలయం మున్సిపాలిటీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముప్పయిన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలను వీక్షి ంచేందుకు లక్షలాదిమంది భక్తులతో పాటు జోగినిలు హాజరవుతారు ఒకవైపు శివుడి వివాహం జరుగుతుండగా జోగినులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం చెందుతారు ఐదు రోజులపాటు అభిషేకాలు పూజలు రద్దు శివ కళ్యాణం సందర్భంగా ఈనెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఆలయంలో నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేకం రద్దు చేయనున్నారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్ర హోమం టికెట్స్ భక్తులు సమర్పించే కోడెల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు



9, మార్చి 2024, శనివారం

వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి

 రాజన్న సన్నిధికి రెండు లక్షల మంది రాక

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారికి స్థానాచార్యులు అప్పల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో మహాలింగార్చన నిర్వహించారు దాదాపు రెండు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు శివదీక్ష పరులతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది సాయంత్రం 6 గంటలకు మహా లింగా అర్చన జరిపారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేసిన అధికారులు నిరంతరం లఘు దర్శనాలకు కొనసాగించారు అర్ధరాత్రి నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు చేశారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ అడిషనల్ కలెక్టర్ గౌతమి పరిశీలించారు




8, మార్చి 2024, శుక్రవారం

వేములవాడ మహా జాతర ప్రారంభం

 వేములవాడలో కనుల పండుగగా మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్ల సమర్పణ వేలాదిగా తరలివస్తున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించారు టిటిడి తరఫున ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాకము మొదలైంది ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రత్యాధికంగా కనిపించింది వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు ధర్మకుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజ్యాంగంలో దర్శించుకుని కళ్యాణ కట్టల తలనీలాలు సమర్పించుకున్నారు కోడి ముక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాధ్యత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి అడిషనల్ కలెక్టర్ గౌతమి ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగలు ఉన్నాయి



7, మార్చి 2024, గురువారం

మహాశివరాత్రికి వేములవాడలో ఏర్పాట్లు

 


మహాశివరాత్రి జాతరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబయింది గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ మహారాష్ట్ర చత్తీస్గఢ్ నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేశారు జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో స్టేజిని రెడీ చేశారు వేములవాడ జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి ఆటో టిటిడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వందలు ఉన్నాయి గురువారం రాత్రి టీటీడీ తరఫున అర్చకులు ఆఫీసర్లు రాజన్నకు పట్ట వస్త్రాలు సమర్పిస్తారు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు 1600 మంది పోలీసులు 640 కెమెరాలతో పహార కాస్తున్నారు కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు పూర్తి చేశారు



6, మార్చి 2024, బుధవారం

రాజన్న ఆలయం ధగ ధగ

 మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగదగలాడుతోంది శివపార్వతుల కటౌట్లు తోరణాలు ఆకట్టుకుంటున్నాయి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు



భక్తులకు బంగారం పడే లేచిన

 పడి లేచిన మర్రిచెట్టు శివ సాయి దేవస్థానంగా పిలుస్తారు ఆలయ ఆవరణలో కొలువైన సాయిబాబా హనుమాన్ ఆలయాలు దాతల సహాయంతో 36 అడుగుల హనుమాన్ విగ్రహం కళ్యాణ మండప నిర్మాణం ముడుపులు పెడితే కోరికలు తీర్చే మర్రిచెట్టు మహిమ


నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

ముత్కాల్ మండల కేంద్రంలోని పడి లేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ విశేష పూజలు జరిగాయి ఉత్సవాల్లో రెండవ రోజు ఆలయంలో ఉదయం వేకువ చామున ప్రతిష్టమూర్తులకు పంచామృతాలతో వేదమంత్రాలతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వుల బిల్వపత్రాలతో అలంకరించి రుద్ర హోమం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు

మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా శివలింగానికి రుద్రాభిషేకం బిల్వార్చన 1121 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం శివరాత్రి జాగరణ భజన కార్యక్రమాలు జాగరణలు జరుగుతాయి రాత్రి లింగోద్భవ కాలంలో బిల్వ అభిషేకం చేయనున్నట్లు తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని రంగులతో వివిధ రంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో అలంకరించారు అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం చలువ పందేళ్లు నీటి వసతులు పార్కింగ్ వసతులు అన్ని ఏర్పాటు చేశారు స్థానిక ఆలయ పూజారుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు

ముక్కాల్ మండల కేంద్రంలో మర్రి వృక్షం సుమారు 200 ఏళ్ల క్రితం ఉన్న ఈ పడిలేచిన మర్రిచెట్టు శ్రీ మహాలింగేశ్వర స్వామి వటవృక్షం. గత 18 ఏళ్ల క్రితం 2005 జనవరి 28వ తేదీన ఆనాటి పరిణామాల దృష్ట్యా భారీ ఈదురు గాలులకు అకస్మాత్తుగా నేలకొరిగింది 33 అడుగుల వృత్త విస్తీర్ణం ఉన్న ఈ మర్రిచెట్టు వృక్ష రాజం కూకటివేళ్లతో సహా పడిపోవడం జరిగింది అనంతరం అదే సంవత్సరం 25 జూన్ 24వ తేదీ శుక్రవారం రోజు ఇలాంటి మానవ ప్రయత్నం లేకుండానే యథాస్థానంలో పునర్ ప్రతిష్టితమై లేచి నిలబడిందని గ్రామస్తులు పేర్కొన్నార

పడి లేచిన మర్రి చెట్టుకు భక్తుల పూజలు

ఆనాటి నుంచి నేటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాలనుంచి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పడి లేచిన మర్రిచెట్టు మహా లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు అంతేకాకుండా మొక్కులు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా సోమవారం వచ్చి వారు కట్టిన ముడుపులు తీసి సత్యనారాయణ వ్రతం చేసే సామూహిక భోజనాలు చేసి స్వామి వారిని దర్శించుకుని భక్తులు వెళుతుంటార

ప్రతి సోమవారం పండుగ వాతావరణం ప్రతి సోమవారం పడలేచిన మర్రిచెట్టు ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వారి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అద్భుత స్థలమైన మహాలింగేశ్వర స్వామి పడి లేచిన మర్రి చెట్టు ప్రతిరోజు భక్తుల పూజలు అందుకుంటుందని పూజారులు అంటున్నారు ప్రతి గురువారం సాయిబాబా హారతి తర్వాత అన్నదానం చేపడతారు మహాశివరాత్రి పురస్కరించుకొన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన శివరాత్రికి మూడు రోజుల ముందు ఆరు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గ్రామంలోని యువకులు పెద్దలు దాదాపు 20 నుంచి 40 మంది 41 రోజుల పాటు శివదీక్షలు తీసుకొని స్వాములు ఆలయం ఆవరణలో ఉంటారు శివరాత్రి పర్వదిన రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మాల తీసి దీక్ష విరమిస్తారు శివరాత్రి నిలారం ఉన్న భక్తులు మరుసటి రోజు మహా అన్నదానం ఒక్కపొద్దుల విరమిస్తారు పడి లేచిన మర్రిచెట్టు పక్కన సాయిబాబా ఆలయం పక్కన 36 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువైంది ఈ విగ్రహ దాత నునుకొండ అంజయ్య నునుగొండ శ్యామల జ్ఞాపకార్థం శ్యామల కళ్యాణమండపం నిర్మించారు మహా లింగేశ్వర స్వామి చుట్టుపక్కల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ధర్మశాల మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల నిర్మాణం వాహనాల పార్కింగ్ స్థలం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికలయ కమిటీ సభ్యులు తెలిపారు



5, మార్చి 2024, మంగళవారం

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 లక్ష్మణ చాందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహాశివరాత్రి ఐదు రోజుల ముందు స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించి నిత్య పూజలు నిర్వహిస్తారు. పేద మంత్రోచ్ఛారణల మధ్య ముత్తైదువల మహిళల నడుమ శివపార్వతుల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయం లోపల జరుగుతున్న స్వామివారి కల్యాణ వేడుకలు బయట ఉన్న భక్తులందరూ తిలకించేందుకు ఆలయ ఆవరణలో ఎల్ఈడి వాల్ స్క్రీన్ ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించారp అనంతరం రథ గుడి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని బయటకు తీశారు ఈ వేడుకలను వీక్షించేందుకు బాబాపూర్ నర్సాపూర్ కనకాపూర్ వడ్యాల్ కన్జర్ బోరిగం రాజాపూర్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భారీ భక్తజనం హాజరయ్యారు ఈనెల 8వ తేదీన శివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు జాగారం సాగనుంది





3, మార్చి 2024, ఆదివారం

రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి వసతికి నాలుగు ట్యాంకుల విరాళం

 నవీపేట మండలంలోని నాగేశ్వర్ లోని రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి సౌకర్యార్థం గ్రామానికి చెందిన కోనేరు పెద్ద భీమిరెడ్డి నాలుగు తాగునీటి ట్యాంకులను విరాళంగా అందజేశారు రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ తాగునీటి ట్యాంకులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు తాజా మాజీ సర్పంచ్ సురేష్ నవీన్ సతీష్ తదితరులు ఉన్నారు

మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని కలెక్టర్కు ఆహ్వానం

 నవీపేట మండలంలోని నాలేశ్వర్ లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని కోరారు శనివారం వారి జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కలిసి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు ఈనెల 8 9వ తేదీలలో నాలేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని వారు కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు మాజీ సర్పంచ్ సరిగా తదితరులు ఉన్నారు



2, మార్చి 2024, శనివారం

వేములవాడ లో ఏడు నుంచి మహాశివరాత్రి పూజలు

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 7 8 9 తేదీలలో నిర్వహించనున్నారు 7న రాత్రి టీటీడీ పట్ట వస్త్రాలు సమర్పిస్తుంది మహాశివరాత్రి రోజు ఎనిమిదిన తెల్లవారుజామున 12 గంటల నుంచి రెండున్నర గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది తెల్లవారుజామున రెండున్నర గంటలనుండి మూడున్నర గంటల వరకు ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు 3:30 నుంచి 3:40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన 3:40 నుండి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి 4:30 నుండి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన రాత్రి 11:35కు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తాం