18, మే 2026, సోమవారం

రమణ మహర్షి భక్తురాలు బాల సరస్వతి

 భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తురాలు మద్దాలి బాలసర సరస్వతి తన 96 ఏళ్ల వయసులో శనివారం సాయంత్రం కన్నుమూశారు తన బాల్యాన్ని గడిపిన ధన్యజీవి ఆమె మద్దాలి సుబ్బారావుతో ఆమె వివాహం జరిపించింది కూడా భగవాన్ రమణ మహర్షి ఏ వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలురు ఉన్నారు సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోనే ఆమె స్వగృహంలో పలువురు ప్రముఖులు రమణాశ్రమ సభ్యులు భక్తులు బంధుమిత్రులు నివాళులు అర్పించారు ఆదివారం ఉదయం తార్నాక హిందూ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.



16, మే 2026, శనివారం

ఆధ్యాత్మిక సమాచారం,16-5-2026

 ముగిసిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు..



ఆత్మకూరులో మూడు రోజులగా కొనసాగుతున్న మరకత లింగేశ్వర స్వామి విగ్రహ పతిష్టాపన ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు పేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలో మరకత లింగాన్ని ప్రతిష్టించారు దీనితో పాటు ఆలయంలో యంత్ర ప్రతిష్ట మూర్తి ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట తదితర కార్యక్రమాలను నిర్వహించారు కాక ఆలయం వద్ద జరిగిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు వేరువేరుగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.


వైభవంగా కోటి కుంకుమార్చన.. 



నవీపేట మండలంలోని బినోల గ్రామంలో శుక్రవారం సామూహిక కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు పురోహితుడు కృష్ణ ప్రసాద్ జోషి ఆధ్వర్యంలో భువనేశ్వరి మాత ఆలయ ప్రాంగణంలో ఈ కోటి కుంకుమార్చన చేపట్టారు ఇప్పటివరకు 42 శుక్రవారం చేపట్టగా ఈనెల 22న జరిగే పూర్ణాహుతితో ముగుస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు పాల్గొన్నారు.

సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు..


కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్డలూరు గ్రామ శివారులో గల నిలిచిపూర్ శ్రీ సరస్వతి దేవి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం అమ్మవారికి పర్వదినం కావడంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు హారతి అక్షరాభ్యాసం వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా చేపట్టారు అనంతరం భక్తులు అమ్మవారికి మొక్కుల తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు
 ఆలయానికి వచ్చే భక్తులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఆలయ  ధర్మకర్త కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పార్సి విఠల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

.

యాదగిరి క్షేత్రానికి జాతీయ గుర్తింపు

 యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మరో అరుదైన రికార్డ్ సాధించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 29వ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూ ఢిల్లీలో జరిగిన సదస్సులో శుక్రవారం ఆలయ ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు ఆలయ డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు తీవ్ర కాలంలో యాదగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు డిజిటల్ సేవలు చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు దీంతో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అధికారులు ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించి సేవలతో భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని అంశాలపై అధ్యయనం చేశారు 82 దరఖాస్తులు లో జాతీయస్థాయి ఈ గవర్నెన్స్ 29వ సదస్సులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 82 దరఖాస్తులు వివిధ విభాగాల నుంచి అందాయి ఇందులో 32 ప్రాజెక్టులతో షార్ట్ లిస్ట్ తయారు చేశారు ఫిస్టులో తెలంగాణ నుంచి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉండటం విశేషం. ఈ నెల 14న యాదగిరి దేవస్థానం ఈవో బృందం ఢిల్లీకి వెళ్లి జూరీ సమక్షంలో ఫైనల్ ప్రెసెంటేషన్ సమర్పించింది ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జాతీయస్థాయిలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరింత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

15, మే 2026, శుక్రవారం

ఆధ్యాత్మిక సమాచారం 15 మే 2026

 25 లక్షల తో గోశాల ఏర్పాటు..




 కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలం కస్లాబాద్ కి చెందిన వ్యాపారవేత్త పత్తి సంతోష్ గోవులపై ఉన్న మమకారంతో తన వ్యవసాయ క్షేత్రంలో 25 లక్షల రూపాయలతో నందగోకులం పేరిట నిర్మించిన గోశాలను శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా వారం ప్రారంభించారు అనంతరం సరస్వతీ స్వామి మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం గొప్ప విషయం అన్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు నాయకులు సతీష్ యాదవ్ రిషప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు..

తాడుకోలు అఖండ హరినామ సప్తాహం.. బాన్సువాడ మండలంలోని తాడుకోలు గ్రామంలో గల విటళేశ్వర ఆలయంలో బాల యోగి శ్యామ్ సుందర్ గిరి స్వామీజీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తః గురువారం నాలుగవ రోజుకు చేరుకుంది .ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం ముంబై నర్సింలు మహారాజ్ నామ కీర్తనలు ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక భావంతో ముంచెత్తారు .కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. 



పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవము.. కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు కేతపండితో ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు కళ్యాణోత్సవం అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఏడు నుంచి 11 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహించారు. 

శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ గోశాలకు వరిగడ్డి అందజేత..



భిక్కనూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ గోశాలకు గురువారం గడ్డి కట్టలను అంద చేశారని ఆలయ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన రైతు కందడి ప్రభాకర్ మెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ కిష్టయ్య పెద్ద మల్లారెడ్డి కి చెందిన రవీందర్ రెడ్డి గడ్డి కట్టలను అందజేశారు అనంతరం రైతులను సన్మానించే స్వామ ప్రసాదాన్ని అందజేశారు.

అంబారిపేటలో ఆలయాల పునః నిర్మాణము 



దోమకొండ మండలంలోని అంబర్పేట గ్రామంలో వెంకటేశ్వర ఆలయం శివాలయాల పునర్నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన గునిగంటి ప్రభాకర్ రావు ముందుకు వచ్చినట్లు సర్పంచ్ అరుట్ల కవిత తెలిపారు సొంత నిధులతో రెండు గుడుల పునరుద్ధరణకు సుమారుగా 25 లక్షలతో కుడి పనులను ప్రభాకర్ రావు మేనకోడలు సురభి నిర్మల సత్యం రావు చేతుల మీదుగా పనులను ప్రారంభించారు కార్యక్రమంలో ఆరుట్ల అనిల్ ఉప సర్పంచ్ సత్య గౌడ్ పంతులు కృష్ణమాచార్యులు దేవాలయ కమిటీ అధ్యక్షులు నీల గంగాధర్ 6 వ వార్డ్ మెంబర్  ఫిరంగి అశోక్ బిలకుర్తి స్వామి గ్రామస్తులు అశోక్ రావు దామోదర్ రావు మిరుదొడ్డి నరసయ్య పాల్గొన్నారు



రాజన్న హుండీ ఆదాయం రెండు కోట్లు 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీకి రెండు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది గత 44 రోజుల నుండి ఆదాయాన్ని భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో లెక్కించగా రెండు కోట్ల 17810 నగదు 175 గ్రాముల బంగారం 12 కిలోల 200 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఉండే లెక్కింపును ఆలయ ఇవ్వు రమాదేవి కరీంనగర్ ఏసి కార్యాలయానికి చెందిన రాజమౌళి పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య నిర్వహించారు 

అంజన్న పెద్ద జయంతి ఆదాయం ఒక కోటి 74 లక్షలు 



జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 15 నుండి 12 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆలయానికి ఒక కోటి 74 లక్షల 18 వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో అంజన రెడ్డి తెలిపారు గత జయంతితో పోలిస్తే ఈసారి 24 లక్షలు అధికంగా వచ్చినట్లు తెలిపారు.

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు..



విజయానికి స్ఫూర్తి ఆంజనేయ స్వామి అని ప్రజలు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం పోతంగల్ మండలం హంగర్గాలో నూతన ఆలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాన్ని తెలిపారు ప్రతి గ్రామంలో ఆలయాల అభివృద్ధికి గ్రామస్తులు పాటుపడాలని పేర్కొన్నారు .


ప్రాచీన చరిత్ర కలిగిన పెద్దంగంటి ఎల్లమ్మ

 నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీంగల్ విరజానది ఒడ్డున గల పెద్దంగంటి ఎల్లమ్మకు 700 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ గ్రామ దేవత 14వ శతాబ్దానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరిగోపాల్ రూడీ పరిచారని అన్నారు. ప్రధాన నల్లరాతి ఎల్లమ్మ విగ్రహం యొక్క ముఖము, చేతులు భిన్నమైనందున తమ చేతులలో ధరించిన పరికరాలు కనిపించడం లేదు. ఎల్లమ్మ అపార శక్తి స్వరూపిణి మాతగా ఆది, మంగళవారాలలో భక్తుల పూజలు అందుకుంటుంది. ఎల్లమ్మ ముందు పరశురాముని తల్లి రేణుకా దేవి విగ్రహం ఉంది .ఎల్లమ్మ పక్కనే ఒక వేప చెట్టు కానుకొని ఉన్న శిథిల రండంతస్తుల వీరగల్లు పదవ శతాబ్దం చాళుక్యుల కాలానికి చెందిన వీరగల్ల శిల్పం ఉంది. రెండో అంతస్తులో వీరులు తలబడే తీరు గతంలో ఏ వీర గల్లులో కనబడలేదు. పై అంతస్తు విరిగిపోయింది .ఒక్క వీరున్ని రెండు వైపులా నుంచి ఇద్దరు దాడి చేస్తున్నట్టుంది. ఇలాంటి వీరగల్లు శిల్పం చాలా అరుదు .చరిత్రకారుడు కంకణాల రాజేశ్వరి వెంట భీమ్గల్ సర్వ సమాజాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు ,రామ్ గిరి ఆనంద్ ఉన్నారు. 



ఘనంగా శ్రీ మరకత ఆత్మ లింగేశ్వర స్వామి ప్రతిష్ట

 


నాగిరెడ్డిపేట మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో శ్రీ మరకత ఆత్మ లింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం గ్రామస్తులు భక్తులు ఘనంగా జరుపుకున్నారు లోక కళ్యాణార్థమై పెద్ద ఆత్మకూరు గ్రామంలో సుందరమైన శివ దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా త్రయాహిన్యక  విధానంలో శ్రీ శ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవము మొదటిరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యహవాచనము అఖండ దీప స్థాపన రక్షాబంధనం రోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండల దేవత ఆవాసము అగ్ని ప్రతిష్ట గణపతి భవనము బింబ సంస్కారం ప్రతిమ శోధన అగ్ని అవతారం జలాధివాసం తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు మొదటి రోజు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్రి అన్నగ లక్ష్మీ, మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

9, మే 2026, శనివారం

గోదావరి తీరాన నాగవీరుడు భైరవుడి శిల్పాలు

 



నిర్మల్ జిల్లాలోని లోకేశ్వర్ మండలంలో ని గోదావరి ఒడ్డున ఉన్న ప్రాచీన బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నుంచి 12 వ శతాబ్దం మధ్య కాలానికి సంబంధించిన అరుదైన శిల్పాలు విగ్రహాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. ఇందులో నాగ వీరుడు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చెప్పారు అప్పటి నాగరాధనకు ప్రతీకగా లేదా యుద్ధంలో వీరమరణం పొందిన యోధుడి జ్ఞాపకార్థంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గుర్రంపై కత్తి డాలు ధరించి యుద్ధానికి సాగుతున్న వీరుడు రూపంతో కూడిన మరో వీర గళ్ళు శిల్పాన్ని కూడా పరిసర ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు ఈ గోదావరి తీర గ్రామాలలో భైరవ సంప్రదాయం విస్తృతంగా ఆచరణలో ఉన్నట్లు ఇక్కడ లభిస్తున్న భైరవ విగ్రహాలను బట్టి తెలుస్తుంది అన్నారు ఆలయ పరిసరాలలో చతుర్భుజ భైరవుడు లజ్జ గౌరీ విగ్రహాలు కూడా లభించాయని తెలిపారు లజ్జ గౌరీ విగ్రహం జైన సంప్రదాయానికి చెందిన యక్షిని శిల్పాన్ని పోలి ఉందని తెలిపారు.

గంగమ్మ దేవి నూతన ఆలయ ప్రాణప్రతిష్ట

 



రామారెడ్డి మండల కేంద్రంలో గంగపుత్రుల కులదైవం శ్రీ గంగాభవాని దేవి గుడి నిర్మాణం భారీ దేయంతో నిర్మించడం జరిగింది. నూతన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర గణపతి సుబ్రహ్మణ్య నందీశ్వర మరియు అద్భుతమైనటువంటి 62 అడుగుల ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంథోత్సవాల మధ్య ఘనంగా శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు నెమలి నాగరాజు శర్మ వల్లంపట్ట నాగరాజు సహాయ పండితులు గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవాచనం మూలమంత్ర హోమాలు యంత్ర ప్రతిష్ట పూర్ణాహుతి కుంబాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండుగ శివ కళ్యాణ మహోత్సవం వీక్షించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ పిలుపుమేరకు మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర్ గుప్తా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్ పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు నామాల లింబాద్రి సెక్రటరీ నూతన ఆలయ నిర్మాణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నామాల రవి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మరియు గ్రామస్తులకు అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం రోజున సాయంత్రం మూడు గంటల నుండి గంగాభవాని దేవికి బోనాలను సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజు ఆదివారం ఇళ్ళకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు కావున బోనాల ఉత్సవాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొని గంగాభవాని తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు ఇట్టి కార్యక్రమానికి సహకారం అందించిన గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంజనాద్రి అంజన్నకు రెండున్నర కోట్ల బంగారు ఆభరణాలు

 కర్ణాటకలోని కొప్పల జిల్లా కిష్కింద గ్రామ పరిధిలోని అంజనాద్రిపై కొలువైన అంజన్నకు హైదరాబాద్ కు చెందిన ఏఎంఆర్ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఏ మహేష్ రెడ్డి 2:30 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల దారిలో బంగారు గద, మకర తోరణం, చత్రం, కిరీటాలను కొండపైకి తీసుకెళ్లి దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం ఆలయంలో విశేష పూజలు చేసి స్వామి వారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి లక్ష్మీ అరుణ సమక్షంలో ఈ ఆభరణాలను అప్పగించారు. గంగావతి తహసిల్దార్ వసంతకుమారి, కనకగిరి తహసిల్దార్ విశ్వనాథ్ మురడి కార్యక్రమంలో పాల్గొన్నారు.



8, మే 2026, శుక్రవారం

ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు హనుమాన్ ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు నారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ జలాధివాసం భజ సంస్కారం నిర్వహించడంతోపాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



6, మే 2026, బుధవారం

వేసవిలో వేగంగా శ్రీవారి దర్శనం

 వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల తిరుపతికి పోటెత్తతున్న భక్తుల రద్దీని టీటీడీ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాసిన సామాన్య భక్తులు ఇప్పుడు ఏడు ఎనిమిది గంటలలోనే స్వామిని దర్శించుకుంటున్నారు .వీఐపీ బ్రేక్, సిఫార్సులేఖల రద్దు, కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ద్వారా క్యూ లైన్ ల నిరంతర పర్యవేక్షణతో టిటిడి  ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సర్వదర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయం 8 గంటల దాటకుండా అధికారులు చర్యలు చేపట్టారు .ఒక దర్శనం కోసం మరో స్లాట్ దర్శనాన్ని ఆపకుండా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ,సిసి కెమెరాలు ద్వారా ఎప్పటికప్పుడు మాడవీధులు, క్యూ కాంప్లెక్స్ లను పర్యవేక్షిస్తున్నారు. స్లాటేడ్ సర్వదర్శనం రెండు నుంచి మూడు గంటల లోపు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండున్నర గంటల లోపు పూర్తవుతుంది .శనివారం లక్ష మందికి పైగా భక్తులు వచ్చినప్పటికీ దర్శన సమయం 13 గంటలకు మించకుండా అదుపు చేయగలిగారు.

3, మే 2026, ఆదివారం

శివుడికి తల్లి అయిన బెజ్జమహాదేవి

 


శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పం నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని బెజ్జం దేవి గుడిలో ఉన్నది. వీరశైవ భక్తురాలైన అక్కమహాదేవి శిల్పం ప్రసిద్ధం. ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహం అంతటిది. పాల్కురికి సోమన బసవ పురాణంలో బెజ్జమహాదేవి కథ రాస్తూ ఆ పిజ్జా మహాదేవి అందరికీ అందరు ఉన్నారు కానీ శివునికి తల్లి ఉన్నట్లయితే తాపసిని కానిస్తుందా జుట్టు జడలు కట్టనిస్తుందా తల్లుంటే విషం తాగనిస్తుందా తోళ్లు కట్టనిస్తదా.. పాముల ధరింపనిస్తుందా బూడిద పూసుకొని స్తుందా. పల్లకాటిలో ఉండనిస్తుందా తల్లి లేనందువల్లనే కదా శివుడికి నికష్టాలు నేనే శివునికి తల్లిని అవుతానని పిచ్చమహాదేవి లింగమూర్తిని కొడుకును చేసుకుని చంటి బిడ్డకు అభ్యంగన స్నానాలు చేయించినట్టు తాను స్నానం ఆడిస్తున్నదట. ఉగ్గు తినిపిస్తున్నదట ముద్దాడుతున్నదట ఆమె చేస్తున్న బాల్యోపచారాలకు శివుడు మిర్చి ఆమె వద్ద శిశువు గానే ఉండిపోయాడట బెజ్జ మహదేవి శివుణ్ణి నాకున్న, నా పట్టి ,నా చిన్న పడగ, నా కుర్ర అని గారాబాలు చేసింది  తన ఒడిలో పడుకోబెట్టుకుని తన్మయం చెందిందని వర్ణిస్తాడు.



బెజ్జూరలో బెజ్జమహాదేవి శిల్పము 

శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పము నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని దేవి గుడిలో ఉన్నది వీరశైవ భక్తురాలైన అక్క మహాదేవి శిల్పము ప్రసిద్ధము ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహము అలా అంతటిది. ఈ శిల్పాన్ని మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ చూసి ప్రతిమ లక్షణాలను గుర్తించడం కోసం ఫొటోలు పంపాడు.



గుహలో వెంకటేశ్వరుడు

 


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపూర్ గ్రామ ఈశన్య దిశలో ఉన్న గుట్టల ప్రాంతంలో సుమారు 150 ఏళ్ల క్రితం వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశారు ఒకరోజు అకస్మాత్తుగా గుట్ట చీలిపోయి అందులో చిన్న గుహ ఏర్పడింది ఆ గుహలో నుంచి వినిపించిన ఘంటానాదం స్వయంగా వెలిగిన దీపజ్యోతి ఈ దృశ్యాలు గ్రామ ప్రజలలో భక్తి జ్యోతిని రగిలించాయి ఆ గుహలో వెలిసిన నిరాకార స్వరూపాన్ని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలవడం ప్రారంభించారు అప్పటినుంచి ఈ క్షేత్రం కొత్త దేవుడిగా ప్రసిద్ధి చెందింది ఏటా శ్రవణ మాసంలో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో పెద్దలతో కలిసి భక్తులు వనభోజనాలు చేస్తారు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఇక్కడ నిర్వహించే వనభోజనాలు ప్రత్యేక పూజలు ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి భక్తులు ముడుపులు కడుతూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు ఈ గుహకు తూర్పు దిశలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం ఈ ప్రాంతానికి మరో ఆధ్యాత్మికత పరిమళాన్ని జోడిస్తోంది గుహ సమీపంలో విరాజిల్లే భారీ మర్రిచెట్టు దాని నీడలో కూర్చుని జపమాలలు తిప్పే భక్తులు గాలిలో తేలే మంత్రం ఈ దృశ్యాలు ఈ క్షేత్రాన్ని ఒక జీవంత ఆధ్యాత్మిక ప్రపంచంగా నిలబెడుతున్నాయి. ఇంతటి ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నప్పటికీ ఈ క్షేత్రం ఇప్పటికీ నిరాదరణలోనే ఉంది ఆలయ నిర్మాణం లేకపోవడం రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉండడం తాగునీరు విద్యుత్ వంటి కనీస వసతులు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఒక చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆలయ నిర్మాణం రహదారులు తాగునీరు విద్యుత్తు విశ్రాంతి గృహాలు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. 




తొర్రూర్ లో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట

 రేపటినుండి మే 14 వరకు గ్రామంలో ఉత్సవాలు ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ను ఆహ్వానించిన కురుమ సంఘం. 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూర్ గ్రామ బీరప్ప స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన నిర్వహణకు 50 వేల రూపాయలను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి శనివారం కురుమ సంఘం పెద్దలకు అందజేశారు. ఈనెల నాలుగవ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో తొర్రూర్ గ్రామంలో పది రోజులు నిర్వహించే దైవ కార్యక్రమాలకు తొర్రూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో మర్రి నిరంజన్ రెడ్డి ని ఆహ్వానించారు. కార్యక్రమంలో కుల పెద్దలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకమ్ లక్ష్మి, జంగయ్య, లింగం ,శ్రీశైలం యాదగిరి ,రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



యాదగిరిగుట్టలో నిత్య కళ్యాణం

 యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజల వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవలను మేల్కొల్పిన అర్చకులు సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసి దళాలను అర్పించారు . ప్రాకార మంటపంలో నరసింహ హోమం, నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని తిరవీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం అయిన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈనెల ఐదున మంగళవారం రోజున హుండీ లెక్కింపు కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2 లో జరుగుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వివిధ శాఖల నుంచి నిత్య ఆదాయంగా 40 లక్షల 25 వేల 26 రూపాయలు వచ్చినట్లు తెలిపారు.



సంబురంగా రథోత్సవం

 మద్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న రథోత్సవం శనివారం రాత్రి ముగిసింది మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో రథ పౌర్ణమి సందర్భముగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు యువకులు గ్రామస్తులు లతాన్ని లాగుతూ లక్ష్మీ రమణ గోవిందా వెంకటరమణ గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 



ఉత్కంఠ భరితంగా సాగిన కుస్తీ పోటీలు.. రథోత్సవం సందర్భముగా గోశాలలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠ గా సాగాయి .చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మల్ల యోధులు తరలివచ్చే కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఆడపిల్లలు సైతం కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. గెలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే నగదు బహుమతిని అందించారు.

పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల విరాళం

 రామారెడ్డి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఎమ్మెల్యేను కలిసి వివరించగానే తక్షణమే స్పందించి రెండు లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మున్ముందు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏఎంసి డైరెక్టర్ రావు ఫ్, బాలయ్య ,డైరెక్టర్ రాజు ,నాయకులు గురజాకుంట స్వామి ,అమ్ముల పశుపతి, రామాలయం చైర్మన్ పశుపతి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోపి, రామ్మూర్తి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



ఆధ్యాత్మిక సమాచారం 3-5-2026

లింగంపేట మండలం ,నల్లమడుగు గ్రామంలో శనివారం పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. రథాల పున్నమి సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడియం వరకు కుస్తీ పోటీలు ఆద్యంతముత్కఠంగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరికి కుస్తీ వెండి కడెం బహుకరించినట్లు తెలిపారు సర్పంచ్ తహసీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. 

ముషీరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు వై చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్ ఏ పావని వినయ్ కుమార్ గౌరీ శంకర్ ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీధర్ చారి తదితరులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పూజ నిర్వహించి కానుకలు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో స్థానికంగా ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది.

700 ఏళ్లుగా కొండెక్కని దీపం

 గంభీరావు పేట లోని సీతారామ సమి గుడిలో అఖండ నందదీపం.



పై చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం లోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండేక్కలేదు అంటే ఆరిపోలేదు. అవును నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వికులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండనందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు, భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తుల తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మించినట్లు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తోంది .ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం /రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమి సందర్భముగా ఈ మండపంలోనే సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను, అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.



శ్రీవారి దర్శనానికి 14 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో పాటు వారాంతం కావడంతో తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది .శ్రీవారి ఆలయ ప్రాంతంలో పాటు మాడవీధులు, లడ్డు కేంద్రం ,అఖిల అండం, ప్రధాన కూడళ్లు ,రిసెప్షన్ కౌంటర్లు, కళ్యాణ కట్టలు రద్దీగా కనిపిస్తున్నాయి. కాలినడక మార్గాలలో రద్దీ తగ్గలేదు .వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు లోని 31 కంపార్ట్మెంట్లు ,నారాయణ గిరిలోని తొమ్మిది షెడ్లు నిండిపోయి క్యూ లైన్ శిలా తోరణం, బాట గంగమ్మ ఆలయం మధ్య వరకు వ్యాపించింది. వీరికి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతుంది.

తిరుపతిలో రెడ్డి భవనం నిర్మాణానికి కోటి రూపాయలు

 


తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పి పి రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాలు రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెడ్డి సంఘం ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి ,వినయ్ కుమార్ రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, కొలను మహేందర్ రెడ్డి తదితరులు సమక్షంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పర్వతాల రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవనం నిర్మించనున్న విషయం తెలిసింది.

2, మే 2026, శనివారం

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

 తిరుమల శ్రీవారి ఆ లయం శుక్రవారం రాత్రి వైశాఖమాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి వారు గరుడనిపై ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు .పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సి వి ఎసవో మురళీకృష్ణ ,తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ పేష్కార్ లోకనాథం, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాలు

 తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలలో 2026 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగేండ్ల డిప్లమా ,రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 4 నుండి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు .పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు .దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు .పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలి. ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి లక్ష రూపాయలను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి కోర్సు పూర్తి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా స్వయం ఉపాధి అవసరాల నిమిత్తం అందజేస్తుంది. వివరాలకు శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ టిటిడి, అలిపిరి రోడ్డు ,తిరుపతి.. ఫోన్ నెంబర్ 0877 2264637 ను సంప్రదించాలి. వెబ్సైట్ www.tirumala.org

తిరుమలలో సర్వదర్శనానికి 14 గంటలు

 తిరుమలేష్ ని సర్వదర్శనానికి శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినది. శుక్రవారం సాయంత్రానికి టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగరి షెడ్లు నిండిపోయాయి .దీనితో స్వామివారి దర్శనానికి 14 గంటలు పట్టనున్నది. విఐపి బ్రేక్ దర్శనాలు, తిరుపతిలో స్లాటేడ్ సర్వదర్శనాలు ,టోకెన్లు రద్దుచేసి తిరుమలలోని సర్వదర్శనానికి  అనుమతించడంపై ఈనెల 6న ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

యాదగిరిగుట్టలో నిత్యం గిరి ప్రదక్షిణ

 



ఇకపై యాదగిరిగుట్టలో ప్రతిరోజు గిరిప్రదక్షిణ నిర్వహణకు కొండ క్రింద వైకుంఠ ద్వారం దగ్గర కృష్ణ శిలతో తయారుచేసిన స్వామి వారి పాదాలు ప్రతిష్టించి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించ, ఆలయ ఈవో భవాని శంకర్తో కలిసి ప్రారంభించారు. రోజు ఉదయం 5:30 కు ప్రత్యేక పూజలు అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని భక్తులు ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వామి వారి జన్మ నక్షత్రమైన "స్వాతి "రోజున మాత్రమే గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.




9 నుంచి తిరుచానూరు నాందేడ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

 నాందేడ్ నుంచి తిరుచానూరు నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ అయిన తర్వాత.. మొదటిసారిగా ఆ ఎక్స్ప్రెస్ రైలు 17633 ఈనెల 9వ తదీన నిజామాబాద్ పెద్దపల్లి మీదుగా నడవనున్నది. 10న తిరుచానూరు నాందేడ్ 17634 ఎక్స్ప్రెస్ నడుస్తుంది దీనికి సంబంధించిన ఉత్తర్వును దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

1, మే 2026, శుక్రవారం

ముగిసిన నరసింహుడు జయంతి ఉత్సవాలు

 యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన నరసింహుడి జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈనెల 26న యాదగిరిగుట్టలో ,27న పాతగుట్టలో ప్రారంభమైన ఉత్సవాలకు మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, నరసింహ జయంతి ,నరసింహ ఆవిర్భావ ఘట్టంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. ఉదయం నిత్య పూజల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత ప్రధాన ఆలయ ముఖమంటపంలో సహస్ర కలశాభిషేకాన్ని జరిపారు. సాయంత్రం ఆలయంలో నరసింహ జయంతి, స్వామి వారి ఆవిర్భావ కార్యక్రమాలు, నివేదన, తీర్థ ప్రసాద  కార్యక్రమాలను నిర్వహించారు. నరసింహుడు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి నిలిపివేసిన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.




శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి జాతరలు 2026

 కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామములో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి జాతర ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు సముద్రాల అమర్నాథ్ చారి, వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షితులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొప్పెల ప్రవీణ్ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4 రోజులుగా ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు నిర్వహించారు.

ఆలయ నేపథ్యం ఏమిటంటే..

అగస్త్య మహాముని గోదావరి పరివాహక ప్రాంతంలో తపస్సు చేస్తూ 3 శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు నిర్మించారని చెబుతారు. ఒకటవది చౌటుపల్లిలో రెండవది మంత్రపురి/ మంథనిలో, మూడవది జైనథ్ లో నిర్మించినట్లు పూర్వీకుల కథనం. 

చౌటుపల్లి లో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1870లో నిర్మించినట్లు ఆలయం వెనుక భాగంలో గల శిలాశాసనం సంస్కృత భాషలో ఉంది .కమ్మర్పల్లి మండల కేంద్రంలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికల్యాణము గురువారం కనుల పండుగ నిర్వహించారు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి భరత్ కోశాధికారి పన్యాల రవి రెడ్డి దంపతులతో పాటు కమిటీ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కమ్మర్పల్లి గ్రామంలో అతి పురాతనమైన పూర్తి రాతి తో కట్టబడి ఉన్న గ్రామస్తుల ఆరాధ్య దైవం గా కొలవబడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొలిసారి రథోత్సవం, జాతర నిర్వహించారు. గురువారం రాత్రి స్వామి వారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నారాయణస్వమి ట్రస్ట్ సభ్యులు మరో 500 స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులను వితరణ చేశారు. 

మోస్రా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత నెల 22వ తేదీ నుంచి గురువారం వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి నవరాత్రులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు మారుతి ఆలయ కమిటీ సభ్యులు ఎగన్నగారి లింగారెడ్డి, సతీష్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

ఆర్మూర్ పట్టణంలో ని గుల్ బంగ్లా వద్ద గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సర్వ సమజ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.

బోధన్ పట్టణంలోని బసవతారక నగర్ లో శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితులు బాలయోగి పిట్ల కృష్ణ మహా రాజు ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

నవీపేట మండలంలోని జన్నేపల్లిలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక నరసింహస్వమి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం

 పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక యువకుడు గురువారం నాడు తన కళా ప్రతిభతో భక్తిని వ్యక్తం చేశాడు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన మోహన్ ప్రభువు అనే భక్తుడు గత పది సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు. 

శ్రీవారి పుష్కరిణి నీటిని ఉపయోగించి సుమారు మూడు గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ వాటర్ పెయింటింగ్ రూపొందించాడు. అతని భక్తిని కళా నైపుణ్యాన్ని చూసిన పలువురు భక్తులు ప్రశంసించారు. 





ఆలయంలో అన్నప్రసాద వితరణ

 బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం దాతలు పోల విట్టల్ గుప్తా, కుటుంబ సభ్యులు, డాక్టర్ తుకారం దంపతులు , బెజుగం శంకర్ దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు .ఆలయ అర్చకులు ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



నైవేద్యాలలో ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరు..

 నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయలు వినియోగం దైవ నివేదనలు ప్రసాదాలలో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచే కొన్ని వర్గాల వారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవడం ఆచారంగా వస్తోంది .ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్విక ఆహారం ప్రధానమని సాధకులు చెబుతారు .నీరుల్లిని, వెల్లుల్లిని తామస రజోగునాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అది కోపాన్ని ,ఆందోళనను, వాంఛలను పెంచుతాయి. కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.

లశునం గృంజనం చైవ పలా0డుం కవకాని చ అభక్ష్యాని ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ.. అని మనుస్మృతి చెబుతోంది. లశునం /ఎల్లుల్లి, గుంజనం /ముల్లంగి, పలాండం/ ఉల్లిపాయ, కవకాని /పుట్టగొడుగులు ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు శ్రీ విద్యాసాధకులు వాటిని తినకూడదు అని భావము.

ఆధ్యాత్మికపరంగా.. ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిని ,వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.

 ఆయుర్వేదము యోగ శాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు తామస రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు. అవి శరీరంలో పైత్య రసాన్ని పెంచుతాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తిస్తాయి. 

పౌరాణికంగా చూస్తే.. రాహు ,కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి ,వెల్లుల్లి పుట్టాయంటారు .అందుకే వాటిని అశుద్ధమైనదిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేదిగా భావిస్తారు.

దైవానికి నివేదన చేసే విషయానికి వస్తే.. పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యములో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమైనా మారుతున్న అలవాట్ల వల్ల పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్పటికీ ,సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే ..నిత్య ఆహార పదార్థాలలో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.

ఘనంగా అష్టోత్తర శతఘటభిషేకం

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున ఆలయంలో మూలమూర్తికి అష్టోత్తర శతఘటభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు చేసి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. 



స్వామి వారి జన్మదిన పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఫల పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య ప్రాంగణంలో 108 అష్టోత్తర శతఘటలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి ఆలయానికి చేరుకుని క్యూ పద్ధతిలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో చైర్మన్ కమలాకర్ రెడ్డి పిఓ ప్రభురామచంద్రన్ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు.



కైలాశ్ మానస సరోవర్ యాత్ర 2026

 కైలాష్ మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. ఈ యాత్ర ఉత్తరాఖండ్లోని లిపులేఖ పాస్, సిక్కిం లోని నాథుల అనే రెండు మార్గాల ద్వారా సాగుతుందని తెలిపింది .లిపులేఖ పాస్, నాథుల నుంచి మొత్తం 20 బృందాలు యాత్రలో పాల్గొంటాయి. ఒక్కో బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారు యాత్ర కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు వెబ్సైట్ను kmy.gov.in ప్రారంభించారని తెలిపారు. ఆసక్తిగల యాత్రికులు ఈ నెల 19వ తేదీ లోపు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు.