బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
19, మార్చి 2024, మంగళవారం
6, మార్చి 2024, బుధవారం
రేపటి నుంచి ఏడుపాయల జాతర
రేపటి నుంచి ఏడుపాయల జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఈనెల 8 నుంచి 10 వరకు జాతర జరగనున్నది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా అందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది వృద్ధులు దివ్యాంగులు పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది విఐపి క్యూ లైన్లు బారికేళ్ళు తాగునీటి కుళాయిలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు
ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దర్శించుకున్నారు రాజ్ భవన్ నుంచి మోడీ ఉదయం 10. 10 నిమిషాలకు ఆలయం కి చేరుకున్నారు ఆయనకు వేద పండితులు ఎల్లంబట్ల రామకృష్ణ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో ప్రధాని నిమిషం పాటు అమ్మవారిని స్మరిస్తూ ధ్యానం చేశారు కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించే కానుకలు సమర్పించారు గర్భగుడిలో ప్రధాన అర్చకుడు రామతీర్థశర్మ వేద పండితులు వేణు మాధవ శర్మ ప్రధానికి వేదాశీర్వచనం చేశారు ఆలయ విశేషాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు ఆలయ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అధికారులు అందించారు అమ్మవారి దర్శనం అనంతరం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి సంగారెడ్డికి వెళ్లారు ఆలయ సందర్భంగా మోడీ సామాజిక మాధ్యమం ఎక్ష్సులో పంచుకున్నారు భారతీయులందరికీ ఆరోగ్యం శ్రేయస్సు సౌభాగ్యం సిద్ధించాలని సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ప్రార్థించాను అని పేర్కొన్నారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన
లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు
24, ఫిబ్రవరి 2024, శనివారం
అమ్మవారి రాజగోపుర నిర్మాణానికి విరాళము
దోమకొండ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి రాజ గోపుర నిర్మాణానికి అతిమాముల విజయ బలరాం దంపతులు పదివేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయిలు నిరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రాజేష్ తాటిపల్లి శ్రీధర్ పోతుల రాజు పూజారి శరత్ చంద్ర తో పాటు ధర్మకర్తల పాల్గొన్నారు.
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపనను విజయవంతం చేయండి
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఈ నెల 19 నుంచి నిర్వహించబోయే కనకదుర్గాదేవి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రేమల శంబురెడ్డి భక్తులను కోరారు శనివారం విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రేమలో మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సరిత బెజకం సత్యనారాయణ సంతోష్ శర్మ రాజు తదితరులు ఉన్నారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జలాభిషేకం హోమం నిర్వహించగా గురువారం విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు వేద పండితుడు సంజీవరావుతో పాటు గౌడ సంఘం సభ్యులు కృష్ణ గౌడ్ మొగలాగౌడ్ అంజా గౌడ్ సురేష్ గౌడ్ సుభాష్ గౌడ్ దంపతులు భక్తులు పాల్గొన్నార
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
బీర్కూరు మండల కేంద్రంలోని తోట్ల హనుమాన్ ఆలయ ఆవరణలో దుర్గామాత సంత్ గులాబ్ బాబా ఆలయాల నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు శ్రీ కాళీ దండి స్వామి వారి ఆధ్వర్యంలో వేద పండితులతో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భవాని కమిటీ అధ్యక్షుడు మాధప్ప ఆనంద పటేల్ గంగా గౌడ్ విజయ్ కన్న రాజశేఖర్ భక్తులు పాల్గొన్నారు






