పెద్దమ్మ తల్లి ఆలయములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పెద్దమ్మ తల్లి ఆలయములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2026, ఆదివారం

పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల విరాళం

 రామారెడ్డి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఎమ్మెల్యేను కలిసి వివరించగానే తక్షణమే స్పందించి రెండు లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మున్ముందు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏఎంసి డైరెక్టర్ రావు ఫ్, బాలయ్య ,డైరెక్టర్ రాజు ,నాయకులు గురజాకుంట స్వామి ,అమ్ముల పశుపతి, రామాలయం చైర్మన్ పశుపతి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోపి, రామ్మూర్తి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



19, మార్చి 2024, మంగళవారం

మాందాపూర్ లో పెద్దమ్మ పండుగ

 బిబిపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి పండుగను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామ దేవత అయిన పోచమ్మకు బోనాలు బుధవారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం బోనాలు సమర్పిస్తారు గురువారం బండ్ల ప్రదర్శన తిరుగు బోనాలు అన్న ప్రసాద వితరణ ఒగ్గు కథలు ఉంటాయని తెలిపారు

18, మార్చి 2024, సోమవారం

మెంట్ రాజు పల్లి లో బోనాల ఊరేగింపు

 డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు బోనాలు ఉన్నాయి వేద్యాలు సమర్పించుకున్నారు ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కలు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు



26, ఫిబ్రవరి 2024, సోమవారం

వైభవంగా పెద్దమ్మతల్లి కళ్యాణ జాతర మహోత్సవం

 



పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి కళ్యాణ జాతర మహోత్సవ వేడుకలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జాతర సందర్భంగా అగ్నిగుండాల నిర్వహణ శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవానికి పెంబి మండలమే కాకుండా ఖానాపూర్ కాడ మామడ అలాగ వివిధ జిల్లాల నుండి సైతం భక్తులు పాల్గొని మొక్కలు తెరుచుకున్నారు అలాగే భక్తులు వారి మొక్కలైన కేశఖండనము తులాభారాలను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజారులు అర్జన్న, విష్ణు భోజన ముదిరాజ్ యువ సైన్యం సభ్యులు ముదిరాజ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

ముగిసిన పెద్దమ్మతల్లి బ్రహ్మోత్సవాలు

 నందిపేట మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పెద్దమ్మతల్లి ఉత్సవాలు శనివారం ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాల కమిటీ ఊరేగింపు పూర్ణాహుతి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు