బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మా శాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా జేఏవో రాములు ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు వారి పాలకమండలి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ ఇన్స్పెక్టర్ కమల రవీందర్ గుప్తా ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీల మొత్తం మూడు లక్షల 6745 రూపాయలు ఆర్జిత సేవలు అభిషేకాల ద్వారా 4348 రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల 393 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఇట్టి మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
15, మార్చి 2024, శుక్రవారం
9, మార్చి 2024, శనివారం
శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు
మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు
7, మార్చి 2024, గురువారం
శివాలయం నూతన చైర్మన్ కు సన్మానం
బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం నూతన చైర్మన్గా ఎన్నికైన కర్నే హనుమంతరావును బుధవారం వీరశైవ లింగాయత్ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కర్ణ హనుమంతరావును చాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సన్మానించిన వారిలో బాబాయప్ప వెంకటేశ్వర దేశాయ్ శ్యామ్ రావు శివకుమార్ అప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ అజయ్ కుమార్ శంకరప్ప ప్రభు అప్ప మాధవరావు పటేల్ నాగభూషణ్ లింగాయత్ సమాధి సభ్యులు జంగమ సమసభ్యులు తదితరులు పాల్గొన్నారు
1, మార్చి 2024, శుక్రవారం
కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్
విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు
శివ మల్లన్న స్వామి ఆలయ నూతన ఉత్సవ కమిటీ బాధ్యత స్వీకరణ
కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం సమీపంలో శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా తెలిపారు ఈ కమిటీలో చైర్మన్గా మైలారం మురళీధర్ను ఎన్నుకోవడం జరిగిందని కమిటీ సభ్యులుగా ఎమ్మాజీ శారద హరిప్రసాద్ సోనీ శృంగవరపు ప్రసాద్ జరుపుల తిరుపతి రాంఠంకి సత్తయ్యలను ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు గురువారం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులని నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మైలారపు మురళీధర్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా శివ మల్లన్న స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయుటకు కమిటీ సభ్యులతో కలిసి సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు ఆలయ ఆవరణలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలోనే వచ్చే మహాశివరాత్రి జాతరకు ముందే మరొక దొడ్ల నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కొమరం భీం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుల్భం చక్రపాణి రావి మురళీకృష్ణ కోటయ్య రవి కాగజ్నగర్ పురపాలక కౌన్సిలర్ రాజేందర్ శ్రీనివాస్ ఐహిత శ్రీనివాస్ కొల్లూరు సతీష్ అనంతుల సురేష్ మైలారపు శ్రీధర్ కొలిపాక చంద్రశేఖర్ సందీప్ శివ తోట వినోద్ కోడిపేక సంతోష్ వాసవి సేవా అధ్యక్షులు కంభంపాటి సంతోష్ తోడూరి సతీష్ రాచకొండ సురేష్ భోగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
28, ఫిబ్రవరి 2024, బుధవారం
శ్రీశైలంలో అమెరికా భక్తుడు భూరి విరాళం
శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఒక భక్తుడు మంగళవారం బూరి విరాళం సమర్పించారు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్ దత్ బంగారు వెండి సామాగ్రి ఆభరణాలను ఆలయానికి అందజేశారు 28.3 గ్రాములు ఉన్న రెండు బంగారు బాషకాలు ఐదు గ్రాముల బంగారు కంకణం ఒకటి. రెండు ఐదు కిలోల వెండి పళ్ళెం 865 గ్రాముల వెండి శక్తి ఆయుధము 550 గ్రాముల వెండి నాగ హారతి 20090 గ్రాముల కుక్కుట ధ్వజము 750 గ్రాముల 5 వెండి గిన్నెలు 920 గ్రాముల గంధక్షత గిన్ని ఒక వంద 90 గ్రాముల కమండలాన్ని 300 గ్రాముల పెద్దక మండలాన్ని కొత్తపల్లి సునీల్ దత్ గారు కుటుంబం అందజేసింది నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూరి సింధూర కూడా 810 మరియు 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్ళాలు 615 గ్రాములున్న మూడు వెండి చెంబులను ఆలయానికి అందజేశారు అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రము ప్రసాదము అందజేసి సత్కరించారు రెండు రోజుల క్రితం చెన్నైకి చెందిన భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.
26, ఫిబ్రవరి 2024, సోమవారం
నే టి నుంచి శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు
కుంటాల మండలంలోని పెంచికల్పాడు గ్రామంలో సోమవారం నుండి ప్రత్యేక వేద పండితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు యొక్క ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు 28 నాడ విగ్రహాల ఊరేగింపు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము పంచాంగ సంస్కారము రక్షాబంధనము ఆచార్యాది వృత్తికి వరణము ప్రవేశఖండదీప యాగశాల స్థాపన చతుస్వయోగిని సహిత వాస్తు కేంద్ర పాలక సర్వతోభద్ర మండప దేవతా కలశ స్థాపన పూజ అగ్ని ప్రతిష్ట లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు స్థాపిత దేవత హవనం సూక్తి ప్రతిష్టంగా నది జలాల ఊరేగింపు పంచామృతంతో జలాధివాసం హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణము 27న ఉదయం 8 గంటలకు కర్మణా పుణ్యవచనం ప్రతిష్ట మూలమంత్ర హోమం స్థాపిత దేవత హవనం సూక్తి హోమము ధాన్యాదివాస కల పుష్ప హోమంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అంతే కాకుండా కుంకుమార్చన హారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు 28న స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్ణ హారతి కళాశాల కుంభ సంరక్షణ స్వామి వారి దర్శనము శాంతి కల్యాణము మహా నైవేద్యం హారతి మంత్రపుష్పంతో అటు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవాలని గ్రామస్తులు పేర్కొన్నారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
అగ్గలయ్య గుట్టపై శివలింగం గుర్తింపు
వెల్లడించిన చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అక్కలయ్య గుట్టపై శివలింగం ఇతర చిత్రాలు ఉన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి వెల్లడించారు అద్దలయ్య గుట్టను పద్మాక్షి గుట్టకు కలుపుతూ ఒక కోట గోడ నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయని రెండు గుట్టల నడుమ రాతి స్తంభాలతో నిలబెట్టిన తోరణ ద్వారం ఉందని వివరించారు ఈ ద్వారం సమీపంలో గుట్ట దిగువన శివలింగం డమరుకం దీపం గంటు చిత్రాలు వేయబడినట్లు తెలిపారు చాళుక్యుల కాలంలో 9 10 శతాబ్దాల నాటికి అగ్గలయ్యగుట్ట ప్రసిద్ధ జైనుల కేంద్రంగా విరాజిల్లిందని తెలిపారు కార్యక్రమంలో 11వ శతాబ్దం నాటికి కాకతీయులు పాలనలోకి వచ్చారని శైవమత ప్రాబల్యం పెరిగిందని చెప్పారు అందులో భాగంగానే అక్కలయ్య గుట్ట దిగువన శైవమత చిత్రాలు గీయబడినట్లు చిత్రాలు రోడ్డుకు పక్కనే ఉండటంతో రోడ్డు ఎత్తు పెరిగి ఈ చిత్రాలు కిందికి వెళ్ళాయని వివరించారు చిత్రాల రక్షణకు పురవస్తు శాఖ చర్యలు తీసుకోవాలని రెడ్డి రత్నాకర్ రెడ్డి కోరారు
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
రామేశ్వర ఆలయం వద్ద నవనాథ శతాబ్ది ఉత్సవాలు
పిట్లం మండలంలోని చిన్న కొడప్గల్ గ్రామపంచాయతీ పరిధిలో రామేశ్వర ఆలయం వద్ద భక్తులు నవనాథ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సోమవారం భక్తులు రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అర్చనలు అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు






